బాలకృష్ణ రియల్ లైఫ్ లోనూ హీరోయే!
వరద భాదితు సహాయార్థం చిత్ర పరిశ్రమ 'స్పందన" పేరిట స్టార్ నైట్ ప్రోగ్రామ్ అంగరంగ వైభవంగా ఆరంభమైంది. చిత్రసీమ అంతా కలసి కట్టుగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేసుకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలకృష్ణ అందరినీ కలుపుకుని ముందుకెళుతున్నారు. అందుకు నిదర్శనంగా ఓ ఉదాహరణ. వేదిక పై గాయనీ గాయకులు 'బంగారు కోడి పెట్ట" అనే పాట పాడుతున్నారు. అది మెగాస్టార్ చిరంజీవి పాత్ర అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాట సింగర్ పాడుతున్నప్పుడు బాలయ్య హమ్మింగ్ చేస్తూ కనిపించారు. ఇది పలువురి దృష్టిని ఆకర్షించింది.
అంతే కాకుండా ఈ కార్యక్రమాన్ని బాలయ్య తన భుజం మీద వేసుకుని సక్సెస్ చేయటానికి అన్ని విధాలుగా కృషి చేశాడు. ఈ కార్యక్రమంలో డాన్స్ చేయడానికి మూడు రోజుల నుంచి ఎంతో ఉత్సాహంగా బాలయ్య రిహార్సిల్ చేశాడట. బాలకృష్ణ చూపిన ఉత్సాహం చూసిన చిత్ర పరిశ్రమలోని చాలా మంది బాలయ్యను ప్రశంసిస్తున్నారు. సో రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా బాలయ్య హీరో అని అందరూ కొనియాడటం విశేషం.


Click it and Unblock the Notifications











