twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగువాళ్లందరికీ, తెలంగాణతో లింక్: 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై బాలకృష్ణ

    By Srinivas
    |

    హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లందరికీ తన వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణ చిత్రాన్ని అంకితం చేస్తున్నానని నందమూరి బాలకృష్ణ అన్నారు. శాతవాహన రాజుల్లో 23వ వాడు గౌతమీపుత్ర శాతకర్ణి అన్నారు. ఆయన చరిత్ర అందరికీ తెలియజేయాలనే దీనిని తీస్తున్నామన్నారు.

    శుక్రవారం బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. దీనికి రాజకీయ, సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు.

    అన్నపూర్ణ స్టుడియోలో జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, జగదీశ్వర్ రెడ్డి, సినీ రంగానికి చెందిన చిరంజీవి, దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ, కె రాఘవేంద్రరావు, వెంకటేశ్‌ తదితరులు హాజరయ్యారు. వీరందరికీ బాలకృష్ణ స్వయంగా ఆహ్వానం పలికారు.

    సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ సీఎం కెసిఆర్, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ బాలకృష్ణ కృతజ్ఢతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

    Balakrishna on Gouthamiputra Satakarni film

    ఎన్టీఆర్ వారసుడిగా నేను వైవిధ్య పాత్రలు చేయాలని తపన పడుతున్నానని చెప్పారు. తాను అలాగే ముందుకు పోతున్నానని చెప్పారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు క్రిష్ రావడం అదృష్టమన్నారు. శాతకర్ణితో మన తెలుగు క్యాలెండర్ ప్రారంభమైందని, అలాంటి వ్యక్తి పాత్ర వేయడం తన అదృష్టమన్నారు.

    ఇది మంచి సినిమా అవుతుందన్నారు. గౌతమీ పుత్ర శాతకర్ణి గురించి కొందరికి తెలియని విషయం ఉందని, కరీంనగర్ జిల్లా కోటిలింగాల ప్రాంతంలో శాతకర్ణి పుట్టారని, అది ఆయన తల్లిగారి ఊరు అని, అక్కడి నుంచి వచ్చి అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారని చెప్పారు.

    అంతర్జాతీయస్థాయిలో గొప్ప తెలుగు రాజు గౌతమీపుత్ర శాతకర్ణి అన్నారు. ఆయన తెలుగు జాతి చరిత్రను అందరికీ చాటి చెప్పారన్నారు. శాతకర్ణి ప్రత్యర్థులకు రెండు ఆప్షన్స్ మాత్రమే ఇచ్చేవారన్నారు. ఒకటి నాకు లొంగిపొండి లేదా మరణించండి... అని చెప్పేవారన్నారు.

    తన తల్లిదండ్రులు, నా ఆత్మబలం, ఫ్యాన్స్ బలం, తెలుగు ప్రజల అభిమానంతో తాను ఎదిగానని చెప్పారు. ఎవరి ప్రలోభాలకు లొంగనిది అభిమానుల ప్రేమ అన్నారు. తన సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది తనతో పాటు నడిచారని చెప్పారు. తన తండ్రి తనకు నట తిలకం దిద్దారని చెప్పారు. నాకు విజయాలతో పాటు అపజయాలు కూడా ఎదురుపడ్డాయన్నారు.

    త‌న వందో సినిమా ఎన్నో కథలు విన్నాన‌ని చెప్పారు. వందో సినిమాకు తగిన చిత్రంగా అవి నాకు న‌చ్చ‌లేదన్నారు. త‌న‌కు సంతృప్తిని క‌లిగించేలా చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని గౌతమీపుత్ర శాతకర్ణికు ఓకే చెప్పాన‌న్నారు. క్రిష్ చెప్పిన కథ త‌న‌కు అమితంగా నచ్చిందన్నారు.

    నాగార్జునుడు తిరిగిన నేల అమ‌రావ‌తిలో గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్ర‌నిర్మాణం జ‌రగ‌నుంద‌న్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి గొప్ప చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు. త‌నను అభిమానులు ఎంత‌గానో ఆద‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రేక్ష‌కుల అభిమాన‌మే త‌న‌ను ఇంత‌టి వాడిని చేసింద‌ని అన్నారు.

    English summary
    Nandamuri Balakrishna on Gouthamiputra Satakarni film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X