బాలయ్య త్వరలో భారీ రోడ్ షో లకు రెడీ అవుతున్నారు. రోడ్‌షోలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తెలుగు దేశం పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. బాలకృష్ణ రాయలసీమ నుంచి ఈ పర్యటనను ప్రారంభించనున్నారు.అందులోనూ ఈ నెల 24న అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి, టీడీపీ నేత దివంగత పరిటాల రవీంద్ర వర్థంతి సభ జరగనుంది. ఈ సభకు గతంలో బాబు హాజరు కాగా, ఈసారి బాలకృష్ణను పంపాల్సిందిగా రవీంద్ర సతీమణి సునీత పార్టీ అధినేతను కోరారు. బాలయ్య ఈ సభకు వెళ్ళటానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. పరిటాల వర్థంతి సభతోనే రాయలసీమలో బాలయ్య ప్రచారానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో ఉన్న బాలయ్య త్వరలో రోడ్‌షోల ప్రారంభానికి ముహూర్తం పెట్టించనున్నారు. ఈ విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు బాలయ్యతో చర్చించారని తెలుస్తోంది. త్వరలోనే పార్టీ నేతలతో చర్చించి షెడ్యూలును ఖరారు చేస్తారు.