మేరా భారత్ మహాన్, చేతులు కట్టుకుని కూర్చోం: ప్రతీకార దాడిపై బాలయ్య, కళ్యాణ్ రామ్
40 మందికిపైగా జవాన్లను బలితీసుకున్న పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం భారత్-పాకిస్థాన్ సరిహద్దులోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడి చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. మంగళవారం తెల్లవారుఝామన జరిగిన ఈ దాడిలో 200 నుంచి 300 మంది జైషే మహ్మద్ గ్రూపుకు చెందిన ఉగ్రవాదులు హతమైనట్లు భావిస్తున్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని బాలాకోట్ సెక్టార్‌లో తిష్టవేసిన జైషే మహ్మద్ ఉగ్రవాదులపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెయ్యి కిలోల బరువున్న బాంబులను ప్రయోగించింది. ఈ ప్రతీకార దాడులపై ప్రతి భారత పౌరుడు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

మేరా భారత్ మహాన్: బాలయ్య
ఈ దాడిపై తెలుగు స్టార్ బాలకృష్ణ స్పందిస్తూ.. ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ ధైర్యం యావత్ భారత దేశానికే గర్వకారణం.. మేరా భారత్ మహాన్! జై హింద్' అంటూ వ్యాఖ్యానించారు. బాలయ్య చేసిన ఈ పోస్టుపై అభిమానులు వేల సంఖ్యలో మద్దతు తెలుపుతూ లైక్స్, షేర్స్, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

చేతులు కట్టుకుని కూర్చోం
నందమూరి కళ్యాణ్ స్పందిస్తూ... ‘ప్రతీకార దాడి చేసి ఉగ్రవాదులను అంతం చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు అభినందనలు. మనల్ని కెలికితే చేతులు కట్టుకుని కూర్చోబోమని ప్రపంచం తెలుసుకుంది' అని ట్వీట్ చేశారు.

రవితేజ
రవితేజ స్పందిస్తూ... ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ప్రతికార దాడికి గర్విస్తున్నాను. సెల్యూట్ టు ఇడియన్ ఎయిర్ ఫోర్స్' అంటూ ట్వీట్ చేశారు.

ప్రభాస్
బిగ్ సెల్యూట్ టూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటూ ప్రభాస్ వ్యాఖ్యానించారు. ఈ దాడిని టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నితిన్, అఖిల్ తదితరులు సమర్థిస్తూ ట్వీట్ చేశారు.v
నిఖిల్
సర్జికల్ స్ట్రైక్స్ చేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు, వారికి అనుమతి ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి హీరో నిఖిల్ సెల్యూట్ చేస్తూ వీడియో షేర్ చేశారు.


Click it and Unblock the Notifications











