సింగిల్ మూవీతో మెగా ఫ్యామిలీని బీట్ చేసిన బాలయ్య!
ఒక్క తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడంలోనూ తమ మార్కెట్ విస్తరించుకుని దూసుకెలుతున్నారు మెగా స్టార్ కుటంబానికి చెందిన హీరోలు. రామ్ చరణ్ మగధీర, రచ్చ సినిమాలతో తమ సినిమాల మార్కెట్‌ను ఒక్కసారిగా విస్తరించుకుంటే, అల్లు అర్జున్ పలు విజయవంతమైన చిత్రాలతో కన్నడ, మలయాళం మార్కెట్‌లో పాగా వేశాడు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్కెట్ స్టామినా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.
ఇలా మెగా కుటుంబానికి చెందిని హీరోలు మెల్లి మెల్లిగా తన మార్కెట్‍ను విస్తరించుకుంటూ పోతుంటే...ఇంత కాలం కేవలం ఏపీకి మాత్రమే పరిమితమైన నందమూరి నట సింహం బాలయ్య ఒకే ఒక్క సినిమాతో మెగా కుటుంబాన్ని బీట్ చేశాడు. బాలయ్య నటించిన 'శ్రీరామ రాజ్యం' తెలుగులో మంచి విజయం సాధించి, తమిళం, మలయాళంలో తన సత్తా చాటడమే కాదు, రేపు బాలీవుడ్‌లో కూడా అడుగు పెడుతోంది. అంతే కాదు ఈచిత్రం ఇంగ్లీష్‍లోనూ విడుదల చేసి
బాలయ్య నటించిన చిత్రాల్లో ఏ చిత్రం కూడా ఇన్ని బాషల్లో ప్రదర్శింపబడలేదు. నిర్మాత సాయిబాబు సినిమాకు అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్ల పరంగా కూడా సినిమా తనకు సంతృప్తిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాపు దర్శకత్వం, బాలయ్య నట, నయనతార అభినయం సినిమా రేంజిని పెంచాయని అంటున్నారాయన.
తమ అభిమాన హీరో సినిమా అన్ని భాషల్లో దుమ్ము రేపడంపై అటు నందమూరి అభిమానులుకూ తెగ సంబర పడిపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో బాలయ్య రాబోయే సినిమాలు ఇతర భాషా మార్కెట్లో కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు ఆయనతో ప్రస్తుతం సినిమాలు తీస్తున్న నిర్మాతలు.


Click it and Unblock the Notifications











