రజనీకాంత్ కావాలన్న కథతోనే బాలకృష్ణకు...

By Srikanya

ఒకానొక సమయంలో ఈ ఔట్‌ లైన్‌ రజనీకాంత్‌ విని తనకు కావాలన్నారు. కానీ తెలుగులో చేయాలని ఉందని చెప్పాను. ఈ చిత్రం బాలయ్య స్థాయిని ఇంకో మెట్టు పైకి తీసుకెళుతుంది. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నాం అన్నారు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు. ఆయన తాజాగా..బాలకృష్ణ హీరోగా 'పరమవీరచక్ర' అనే టైటిల్ ని ప్రకటించారు. ఈ చిత్రం గురించి చెబుతూ ఆయన...'నన్నెంతో ప్రోత్సహించిన గొప్ప హీరో ఎన్టీఆర్. ఆయన కుమారుడు బాలకృష్ణతో 'సర్దార్ పాపారాయుడు', 'బొబ్బిలిపులి' చిత్రాల స్థాయిలోఉండే 'పరమవీరచక్ర' చిత్రాన్ని రూపొందించనుండటం, ఇది నా 150వ చిత్రం కావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. రెండేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన జరుగుతోంది. నేను తయారు చేసుకున్న సబ్జెక్టుకి పరిపూర్ణ న్యాయం చేయగల నటుడు బాలకృష్ణ మాత్రమే. ఈ సబ్జెక్టుని రజనీకాంత్ అడిగినా నేను ఇవ్వలేదు. మా ఇద్దరి కాంబినేషన్ పట్ల ఏర్పడే అంచనాలను అధిగమించేలా 'పరమవీరచక్ర' చిత్రం ఉంటుంది. బాలకృష్ణ ఈ సినిమాలో చరిత్రలో నిలిచే స్థాయి పాత్రని ధరిస్తున్నారు. కష్టపడే తత్వం, సినిమా నిర్మాణంపై సంపూర్ణ అవగాహన ఉన్న నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయనకి అభినందనలు' అన్నారు. ఇంకా ఈ సమావేశంలో చిత్ర సహ నిర్మాత సి.వి.రావు కూడా పాల్గొన్నారు. తేజ సినిమా పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఎస్‌.రమేష్ ‌బాబు సమర్పకుడు. జూన్‌ 10 నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X