పరమవీర చక్రపై అప్పుడే మొదలైన బాలయ్య బాబు మదిలోని సందేహాలు..
సింహా తర్వాత బాలయ్యబాబు దాసరి నారాయణరావు దర్శకత్వంలో చేస్తున్న సినిమా పరమవీర చక్ర. ఈసినిమా మొత్తం పూర్తిగా అయిపోయిందని సమాచారం. ఐతే దాసరి తీసినటువంటి కోన్ని సీన్లు బాలయ్య బాబుకి నచ్చలేదని దాంతో బాబు కోంచెం అసంతృప్తిగా ఉన్నాడని సమాచారం. అంతేకాకుండా సినిమా కూడా బాబుకి అంత తృప్తిని ఇవ్వలేదని బాబు తన మిత్రుల దగ్గర అన్నట్టు సమాచారం. దాంతో బాబు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడంట.
దాంతో ఎన్నో సంవత్సరాలుగా హిట్ లేని బాబుకి తనయొక్క చాకచక్యంతో సింహాలాంటి బంపర్ హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి కబురుపంపాడంట. అక్కడికి వచ్చినటువంటి బోయపాటి శ్రీనుకి బాబు చేస్తున్నటువంటి కోన్ని సీన్లు చూపించడం జరిగిందంట. అంతేకాకుండా ఇలాంటి సందర్బాలలో ఏవిధంగా యాక్షన్ చేస్తే బాగుంటుందని ఒక సలహా కూడా అడిగాడని సమాచారం. ఇప్పటివరకు తీసినటువంటి సినిమాని చూపించడం మాత్రమే కాకుండా అందులో ఏమైనా మార్పులు ఉంటే ఎవరికి తెలియకుండా తనతోనే డైరెక్టుగా వచ్చి చెప్పమని పురమాయించాడని పిలింసిటీ వర్గాల సమాచారం.. బాలయ్య బాబు ఇలా చేయడానికి కారణం బోయపాటి శ్రీనుపై ఉన్న నమ్మకమేనని చాలా మంది సినీ విశ్లేషకులు అంటున్నారు. ఒకసారి ఎవరినైనా బాబు నమ్మాడంటే వాళ్శకి చాలా ప్రాముఖ్యత ఇస్తాడని అది బాలయ్య నైజం అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











