బాలకృష్ణ 'పరమవీర చక్ర' చిత్రాన్ని ఒక్క రోజుకే తీసేస్తారు
బాలకృష్ణ,దాసరి కాంబినేషన్ లో ఎంతో క్రేజు గా రెడీ అయి సంక్రాంతికి విడుదల అవుతున్న "పరమవీర చక్ర" చిత్రం దాదాపు ఇరవై ధియోటర్లలో మొదటిరోజునే తీసేయనున్నారు. దీనికి కారణం మరుసటిరోజు మిరపకాయ చిత్రం విడుదల ఉండటమే. మొదటిరోజునే ఎక్కువ ధియోటర్లలో విడుదల చేయాలనే నిర్మాతల ఆలోచనే దీనికి కారణమని తెలుస్తోంది.అయితే ఇది ఎక్కువగా హైదరాబాద్ లో జరగనుంది.ఇక్కడ ధియోటర్లలో రెండో రోజు మిరపకాయ కోసం,మూడువరోజు "అనగనగా ఓ ధీరుడు" కోసం కొన్నిధియోటర్స్ ని ఖాలీ చేయాల్సి వస్తోంది. ఇది అభిమానులకు బాధ కలిగించే విషయమే అయినా తప్పదంటున్నారు. పరమవీర చక్ర సినిమాలో బాలకృష్ణ సైనికాధికారిగా, సినిమా హీరోగా కనిపించనున్నారు. అలాగే సినిమాలో బాలకృష్ణ సినిమా హీరోగా నటిస్తున్నారు కాబట్టి, అయిదుగురు దర్శకులు బి.గోపాల్, శ్రీను వైట్ల, సింగీతం శ్రీనివాసరావు, కోడి రామకృష్ణ, ఎస్.శంకర్ ఈ సినిమాలో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలయ్య సరసన అమీషా పటేల్, షీలా, నేహాధూపియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











