కులుమనాలిలో పొట్రియాటిక్ కాన్సెప్ట్ తో బాలకృష్ణ...!?
'సింహా" చిత్రం తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రం 'పరమవీర చక్ర". తేజ సినిమా పతాకంపై దాసరి నారాయణరావు దర్శకత్వంలో సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమీషాపటేల్, నేహాధూపియా, షీలా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులూమనాలిలో జరుగుతోంది. ఇక్కడ ఆర్మీ రిలేటెడ్ సీన్స్ చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం పొట్రియాటిక్ కాన్సెప్ట్ తో చిత్రీకరించనున్నారు.
ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్యర్యంలో ప్రస్తుతం వార్ ఎపి సోడ్స్‌ని చిత్రీకరిస్తున్నారు. చిత్ర ప్రధమార్థంలో ఒకే ఫైట్ ఉండడంతో ఇంతకు ముందు రామోజీ ఫిలింసిటీలో భారీ ఎత్తున చిత్రీకరించారు. ద్వితీయార్థం అంతా పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ గా సాగుతుంది. అందుకోసం ఐదు ఫైట్స్ ను రామ్-లక్ష్మణ్ లు కంపోజ్ చేస్తున్నారు. నవంబర్ 1వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. సంక్రాంతి కానుకగా విడుదలయ్యే ఈ చిత్రంలో బాలకృష్ణ సినీ హీరోగా, ఆర్మీ మేజర్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. డైరెక్టర్ శ్రీను వైట్ల ఒక ప్రధాన పాత్రను చేయనున్నారు.


Click it and Unblock the Notifications











