బాలకృష్ణ 'పరమవీర చక్ర' లేటెస్ట్ ఇన్పో..
బాలకృష్ణ, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పరమవీర చక్ర. ఈ చిత్రం తేజ సినిమా పతాకంపై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు. సినిమా ప్రొగ్రెస్ గురించి నిర్మాత కల్యాణ్ మాట్లాడుతూ "ఈ నెల 18 నుంచి షెడ్యూలు జరుపుతున్నాం. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నాం. ఫైట్‌మాస్టర్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్న ఈ సన్నివేశాల్లో హీరో హీరోయిన్లు బాలకృష్ణ, అమీషా పటేల్, కొత్త విలన్ అంజాద్ ఖాన్, 40 మంది ఫైటర్లు పాల్గొంటున్నారు. మరో రెండు రోజులు వీటిని తీస్తాం. సెప్టెంబర్ 25 వరకు ఈ షెడ్యూలు జరుగుతుంది" అని చెప్పారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రలలో కనిపించనున్నారు. ఒకటి ఆర్మి మేజర్ గానూ, మరొకటి సినీ హీరోగానూ కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నేహా ధూపియా, షీలా, అమీషా పటేల్ చేస్తున్నారు.
More from Filmibeat
బాలకృష్ణ పరమవీర చక్ర అమీషా పటేలల్ షీలా నేహా ధూపియా దాసరి నారాయణ రావు balakrishna paramaveera chakra amisha patel sheela neha dhupia dasari narayana rao


Click it and Unblock the Notifications











