బాలకృష్ణ సినీ వివాదం...దాసరి దిష్టిబొమ్మ దగ్ధం
బాలకృష్ణ, దాసరి నారాయణరావు కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం పరమవీర చక్ర. ఈ చిత్రం టైటిల్ మార్చాలని రాష్ట్ర మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు దిష్టిబొమ్మని దగ్గం చేశారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు రంగయ్య గౌడ్ అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ పరమ వీర చక్ర సినిమా పేరు పెట్టవద్దని తాము దాసరి నారాయణ రావును కల్సి కోరామని చెప్పారు. ప్రముఖ నటుడు బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా పేరు పరమ వీర చక్ర గా నిర్ణయించారని తెలిసిన నాటినుండి తమ సంఘం అభ్యంతరం తెలుపుతోందని అన్నారు. మిలటరీలో ఎంతో గొప్పతనానికి ఇచ్చే పురస్కారం పరమవీరచక్రం అని, ఎంతో పవిత్రత, దేశభక్తికి మారుపేరుగా చెప్పుకునే దానిని కించపర్చేవిధంగా పరమ వీర చక్ర పేరు వాడరాదని రంగయ్య గౌడ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సైనికుల పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











