twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్వచ్ఛభారత్‌: చీపురు పట్టిన బాలకృష్ణ(ఫొటో)

    By Srikanya
    |

    అరకులోయ: స్వచ్ఛ భారత్‌.. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు ఇప్పుడు అందరికీ ఓ తారకమంత్రం. ఆ కార్యక్రమంలో భాగంగా బుధవారం అరకులోయ మండలం ఎండపల్లివలసలో నిర్వహించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ పాల్గొని చెత్తను వూడ్చారు.

    బాలకృష్ణ మాట్లాడుతూ.. పరిశుభ్రమైన రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. హుద్‌హుద్‌ అనంతరం కూడా సినిమాల చిత్రీకరణకు విశాఖ అనుకూలమే అనే సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే అరకులో తన సినిమా షూటింగ్‌ చేపట్టినట్టు ఆయన వివరించారు.

    హుద్‌హుద్‌ తుపాను ప్రభావానికి విశాఖపట్నం భారీ నష్టాన్ని చవిచూసినా.. సినిమాల చిత్రీకరణకు విశాఖ ఇప్పటికీ అనుకూలంగానే ఉందని ప్రముఖ సినీ నటుడు, హిందూపూర్‌ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. హుద్‌హుద్‌ తుపాను ప్రభావంతో అరకు 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అరకును అభివృద్ధి చేస్తామని అన్నారు.

    Balakrishna Participated in ‎Swacha Bharat

    మండలంలో కొండచరియలు విరిగిపడి తల్లిదుండ్రులు, పిల్లలను పోగొట్టుకొని నందివలస పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులను బుధవారం పరామర్శించారు. ప్రభుత్వం సేవలపై ఆరాతీశారు. ఉచితంగా ఇస్తున్న నిత్యావసర వస్తువులు అందుతున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ తుఫాన్‌తో జీవనోపాధి కోల్పొయిన వారిలో మనోధైర్యాన్ని నింపేందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఏజెన్సీలో పోడుసాగుతో పాటు కాఫీ, మిరియాలు నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లు నేలమట్టమయ్యాయన్నారు. నందివలస పాఠశాలలో పిల్లలతో ముచ్చటించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన కాఫీ తోటలు పరిశీలించారు. బాలకృ ష్ణతో ఫొటోలు తీయించుకునేందుకు గిరిజన మహిళలు ఆసక్తి చూపారు.

    English summary
    Balakrishna once again proved that how committed he is towards social welfare programs. He promised a pledge with Swach bharat ambassadors who took part actively in the program.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X