twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ సెంటిమెంట్ తో మరో ‘నాయుడు’ రికార్డ్ సృష్టిస్తుందా..?

    By Sindhu
    |

    బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి దర్శక్వంలో ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న భారీ చిత్రం శరవేగంగా షూటిగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి 'మహదేవనాయుడు" టైటిల్ పరిశీలనలో వుందని తెలుస్తోంది. దీనితో పాటు మరికొన్ని టైటిల్స్ అనుకుంటున్నప్పటికీ మహదేవనాయుడు అనేదే ఎక్కువగా వినిపిస్తోంది. నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ హిట్ అయి ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలిసిందే. అదే కోవలో ఈ సినిమా కూడా సంచలనం సృష్టిస్తుందన్న సెంటిమెంట్ తో ఈ టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం.

    అయితే నరసింహనాయుడు తర్వాత పలనాటి బ్రహ్మనాయుడు అనే డిజాస్టర్ కూడా బాలకృష్ణ ఖాతాలో వుంది. మరి ఆ విషయం దర్శకనిర్మాతల దృష్టిలోకి రాలేదేమో. పరుచూరి మురళి మాత్రం బాలకృష్ణను ఓ కొత్త డైమెన్సన్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. ఇంతకుముందు బాలకృష్ణ చేసిన క్యారెక్టర్ల కంటే విభిన్నంగా వుండే ఈ క్యారెక్టర్ తప్పకుండా సంచలనం సృష్టిస్తుందని బాలయ్య కూడా నమ్ముతున్నాడు. అయితే మహదేవ నాయుడు అనే టైటిల్ మాత్రం అఫిషియల్ గా కన్ ఫర్మ్ చేయాల్సి ఉంది.

    English summary
    Director Paruchuri Murali's forthcoming untitled Balakrishna starrer, produced by M.L. Padmakumar Chowdary under the banner of Sri Keerthi Combines Movies, has commenced its second schedule at Ramoji Film City, Hyderabad. The first schedule was completed in Vizag on February 25. Set in Rayalaseema backdrop, the film has five songs, composed by Kalyani Malik.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X