twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్-బాలకృష్ణ సేమ్‌లుక్ (కామెంట్ ప్లీజ్..)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్‌: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నట సింహం బాలకృష్ణ సేమ్ లుక్, సేమ్ స్టైల్‌తో దర్శనం ఇవ్వడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. పవన్ కళ్యాణ్ స్టైల్ విషయంలో బాలకృష్ణను ఫాలో అవుతున్నారని నందమూరి అభిమానులు అంటుంటే....మా హీరో ట్రెండ్ సెట్టరే తప్ప ట్రెండ్ ఫాలో అయ్యే వాడు కాదని పవర్ స్టార్ అభిమానులు అంటున్నారు.

    ఈ ఫోటోలో ఇద్దరి డ్రెస్సు, స్టైల్, ఆటిట్యూడ్ కూడా ఒకేలా ఉంది. అఫ్ కోర్స్ ఇది అనుకోకుండా జరిగిన సంఘటనే అనుకోండి. మరి ఈ ఫోటోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్సులో వెల్లడించండి. అయితే మీ కామెంట్స్ ఎవరినీ ఇబ్బంది పెట్టే విధంగా ఉండొద్దని మనవి. జస్ట్ సరదాగా మీ అభిప్రాయం ఏమిటో చెబితే చాలు.

    Balakrishna -Pawan kalyan

    బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయసింహ' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌‌ను ఓ హీరోయిన్‌గా ఎంపిక చేసారు. మరో హీరోయిన్ ఎంపిక జరుగాల్సి ఉంది. జగపతిబాబు విలన్ పాత్ర పోషిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, వారాహి చలన చిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోపీ ఆచంట, రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర, సాయి కొర్రపాటి నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'సింహా' తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది.

    పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే, ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్రంలో సమంత, ప్రీణీత హీరోయిన్లు, నదియా పవన్ అత్త పాత్రలో కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి ఈచిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్-2' చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు పవన్.

    English summary
    Nandamuri Natasinha Balakrishna and Power star Pawan kalyan Appearance in same look Unfortunately.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X