For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి, బాలయ్య మధ్య ఇంకా అవే ఈక్వెషన్స్... అందుకే రాలేదు!

    |

    బాలకృష్ణ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్'. తన తండ్రి జీవితంపై తీస్తున్న సినిమా కావడంతో నిర్మాణ బాధ్యతలు కూడా తన భుజాలమీదే వేసుకున్నారు బాలయ్య. ఎన్టీఆర్- కథానాయకుడు, మహానాయకుడు రెండు భాగాలుగా బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    హైదరాబాద్‌లో జరిగిన బయోపిక్ ఆడియో రిలీజ్ వేడుక సినీ ప్రముఖుల రాకతో కన్నులపండుగలా సాగింది. ఇండస్ట్రీకి చెందిన ముఖ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. అయితే చాలా మంది కళ్లు ఈ ఈవెంటులో మెగాస్టార్ చిరంజీవి కోసం వెతికాయి. కానీ ఆయన కనిపించలేదు.

    బాలయ్య ఫోన్ చేశారు

    బాలయ్య ఫోన్ చేశారు

    ఇండస్ట్రీలో బాలయ్య, చిరంజీవి మధ్య ముందు నుంచీ మంచి స్నేహం ఉంది. రాజకీయాల్లో కొన్ని విబేధాల వచ్చినా అది వారి స్నేహంపై పెద్దగా ప్రభావం చూపలేదు. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంచ్ ఈవెంటుకు రావాలని బాలయ్య స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి ఆహ్వానించారట.

    చిరంజీవి ఎందుకు రాలేదంటే...

    చిరంజీవి ఎందుకు రాలేదంటే...

    మెగాస్టార్ తన తాజీ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి' షూటింగులో బిజీగా ఉండటం వల్ల రాలేక పోయారు. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగడం లేదని, ముంబైలో జరుగుతోందని, అందుకే మెగాస్టార్ రాలేక పోయారని టాక్.

     ఆ ఈక్వెషన్స్ ఇప్పటికీ అలాగే...

    ఆ ఈక్వెషన్స్ ఇప్పటికీ అలాగే...

    చిరంజీవి, బాలయ్య ఇద్దరి మధ్య మొదటి నుంచి ఉన్న స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. రాజకీయాల ప్రభావం తమ స్నేహం మీద పడకుండా ఈక్వెషన్స్ కొనసాగిస్తున్నారు. సమయం వచ్చినపుడు మాత్రమే వీరి స్నేహం బయటకు ఫోకస్ అవుతూ ఉంటుంది.

    ఇద్దరి జీవితంలో ఇవే టాప్

    ఇద్దరి జీవితంలో ఇవే టాప్

    చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి'. బాలయ్య సినీ జీవితంలో చేస్తున్న అత్యంత గొప్ప చిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్'. ఈ రెండు సినిమాలు 2019లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుండటం మరో విశేషం.

    English summary
    Film Nagar source said thta, Nandamuri Balakrishna personally called Megastar Chiranjeevi and invited him for the NTR biopic audio launch but Chiranjeevi could not make it to the event as he is busy with the shoot of Syeraa at Mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X