వీరాభిమానం, ఆయనే దేవుడు: వెడ్డింగ్ కార్డ్ మీద బాలయ్య ఫోటోలతో..

Recommended Video

Wedding Card Of Nandamuri Balakrishna Fan Goes Viral || Filmibeat Telugu

భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు అగ్రహీరోల్లో బాలకృష్ణ ఒకరు. ఆయన అభిమానులు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. పొరుగురాష్ట్రాల్లోనూ ఈ నందమూరి హీరోను అమితంగా అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తాజాగా కర్ణాటకలోని ఓ అభిమాని చర్య అందరినీ ఆశ్చర్య పరిచింది.

ఇప్పటి వరకు మనం బాలయ్య సినిమా విడదులైనపుడు భారీ కటౌట్లు కటడ్డం, ఆయన పుట్టినరోజు వేడుక సందర్భంగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చూశాం. అయితే తాజాగా ఓ అభిమాని పెళ్లి శుభలేఖపై బాలయ్య ఫోటో వేయించారు. ఇప్పటి వరకు ఏ అభిమాని చేయని విధంగా వినూత్నంగా అభిమానం ప్రదర్శించడం హాట్ టాపిక్ అయింది.

కర్ణాటకకు చెందిన అభిమాని

కర్ణాటకకు చెందిన అభిమాని

కర్ణాటకకు చెందిన శ్రీనివాసులు తన కుమారుడి వివాహం సందర్భంగా బాలయ్యపై తన ఇష్టాన్ని, అభిమానాన్ని చాటుకోవాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే ఆలస్యం... బాలయ్య ఫోటోలతో పెళ్లి పత్రిక అచ్చు వేయించారు. ఈ పత్రిక చూసిన బంధువులు ఆశ్చర్యపోతున్నారు.

ఆయనే దేవుడు

ఆయనే దేవుడు

సాధారణంగా పెళ్లి పత్రిక పైభాగం దేవుడి ఫోటో ముద్రిస్తారు. అయితే ఈ పత్రికలో వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న బాలయ్య ఫోటో ముద్రించడం గమనార్హం. కవర్ పై బాలయ్య ఫోటో... లోన పత్రికపై వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న బాలయ్య పిక్, వెనక స్టైలిష్‌గా మరో పిక్‌తో పత్రిక అచ్చు వేయించారు.

మే 13న వివాహం... నందమూరి అభిమానులంతా ఆహ్వానితులే

మే 13న వివాహం... నందమూరి అభిమానులంతా ఆహ్వానితులే

మే 13న తన కుమారుడి వివాహం జరుగుతోందని, నందమూరి అభిమానులంతా ఈ పెళ్లి వేడుకకు ఆహ్వానితులే అంటూ శ్రీనివాసులు అందులో పేర్కొన్నారు. ఈ పత్రిక విషయం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ సైతం ఇలాంటి ప్రపయోగం ఎప్పుడూ చేయలేదు.

నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ

బాలయ్య నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బాలయ్య మరో రెండు చిత్రాలకు కమిటయ్యారు. అందులో ఒకటి కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దీని తర్వాత సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ విజయాలు అందించిన బోయపాటి శ్రీనుతో మరో సినిమా చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X