పౌరానికాల్లో రెండవది నర్తనశాల..తప్పకుండా పూర్తి చేస్తా: బాలకృష్ణ
'శ్రీరామ రాజ్యం" చిత్రాన్ని బాపు తప్ప ఎవరూ చేయలేరు. సాయిబాబుగారు తప్ప ఎవరూ నిర్మించలేరు. 'శ్రీరామరాజ్యం" చిత్రం ఆరంభం మాత్రమే. మరిన్ని పౌరాణిక చిత్రాలను చేయాలని వుంది. గతంలో నేను 'నర్తనశాల" చిత్రాన్ని ఆరంభించి కొన్ని కారణాల వల్ల ఆపేయడం జరిగింది. ఈ చిత్రాన్ని పూర్తిచేస్తామని ఒకరిద్దరు నిర్మాతలు అడుగుతున్నారు. కనుక ఇకముందు పౌరాణిక చిత్రాల శకం ఆరంభమయ్యే అవకాశముంది" అన్నారు బాలకృష్ణ. 'శ్రీరామరాజ్యం" చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఆయన రేడియో మిర్చి కార్యాలయానికి విచ్చేసి శ్రోతలతో ముచ్చటించారు. వివిధ ప్రాంతాల నుంచి శ్రోతలు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ప్రేక్షకులందరూ 'శ్రీరామరాజ్యం" చిత్రం ఎప్పుడొస్తుందా అని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. పౌరాణిక చిత్రాల రూపకల్పనలో తెలుగువారికి ఎవరూ సాటిరారు. ఈ చిత్రానికి ఎంతో మంది లబ్దప్రతిష్టులు పనిచేశారు. ముళ్లపూడివారు మన మధ్యన లేకపోయినా ఎప్పుడూ వారిని తలచుకుంటాం. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రేడియో మిర్చివారు నాటి రాముడి పాత్ర నుంచి ఈనాటి రాముడి పాత్రలపై శ్రోతలతో ముఖాముఖి నిర్వహించడం ఆనందంగా వుంది. ఈ చిత్రంలో శ్రీరాముని పాత్రను చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను" అన్నారు.


Click it and Unblock the Notifications











