మిత్రుడు ఏమయ్యాడు?
బాలకృష్ణ, ప్రియమణి కాంబినేషన్లో ఈ రోజు(శుక్రవారం)రిలీజైన మిత్రుడు సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవటం లేదని టాక్. అయితే బాలకృష్ణ గతంలో కన్నా ఈ చిత్రంలో గ్లామర్ గా కనిపించటాన్ని మాత్రం అభిమానులు ఎంజాయ్ చేస్తున్నాడు. రాజమౌళి శిష్యుడు మహదేవ్ రూపొందించిన ఈ చిత్రంలో కథే లోపమని తేలుస్తున్నారు.
విజయేంద్రప్రసాద్ అందించిన ఈ చిత్ర కథ మరీ ఎనభైలనాటి కథలా ఉండటం, ఇంకా జాతకాలు చుట్టూ కథనం నడవటం జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. అయితే ఎమోషనల్ సన్నివేశాల్లో బాలయ్య మంచి నటన చూపారని, ఆ సన్నివేశాలు కొద్దొ గొప్పో పండాయంటే ఆయన ప్రతిభే కారణం అంటున్నారు. ఇక ప్రియమణి కొంత వరకూ అందాల విందు చేసినా..ద్రోణ చిత్రంలో బికినీ సన్నివేశంతో పోల్చుకుని నిరాశచెందుతున్నారు. ఏదైమైనా మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న మిత్రుడు..ఆశించిన రీతిలో మెప్పించలేకపోతున్నాడనేది ట్రేడ్ టాక్.
balakrishna priyamani mithrudu rajamouli mahadev vijayendra prasad బాలకృష్ణ ప్రియమణి మిత్రుడు మహదేవ్


Click it and Unblock the Notifications