తొలి రోజే అదరకొట్టిన బాలయ్య
డైలాగ్స్ చెప్పడం నందమూరి బాలకృష్ణకు అందెవేసిన చెయ్యి. ఎలాంటి డైలాగ్స్ అయినా ఏకధాటిగా చెప్పడంలో దిట్ట. అసలు టాలీవుడ్ లో బాలయ్య డైలాగులకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నరసింహనాయుడు చిత్రం లోని "కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా..." అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఆ మాట కొస్తే బాలయ్య కోసమే ప్రత్యేకంగా డైలాగులు పెట్టేందుకు దర్శకులు ఆసక్తి చూపుతారు. ఇటీవలే విడుదలై ప్రేక్షకుల తిరస్కారానికి గురైన "మిత్రుడు" సినిమాలో బాలకృష్ణ మార్కు డైలాగులు లేకపోవడం ఆయన అభిమానులని తీవ్రనిరాశకు గురిచేసింది. ఇదే సినిమాకు వున్న ప్రధానలోపం అన్నవారూ లేకపోలేదు.
ఇప్పుడీ వర్ణనంతా దేనికంటే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం "సింహ" లో బాలయ్య భీభత్సమైన డైలాగ్స్ తో మనముందుకు రాబోతున్నట్టు సమాచారం.
"నేను చెప్పేటప్పుడు నీ ఒంట్లో చెవులొకటే పనిచెయ్యాలి... ఇంకో అవయవం ఏదన్నా పనిచేసిందా...నీ నెక్ట్ బర్తడే కి వుండదు". ఇదీ బాలయ్య ముహూర్తపు షాట్ లో చెప్పిన తొలి డైలాగు. ముహూర్తపు షాటే ఇలా వుంటే ఇక సినిమాలో అదరగొట్టేసుంటారని విన్న ప్రతిఒక్కరూ అనుకొంటున్నారు. చూద్దాం కనీసం ఈ చిత్రంతో నైనా బాలయ్య తన అభిమానులని అలరిస్తారో లేదో...


Click it and Unblock the Notifications











