బాలయ్య ‘అనుచరుడు’ బాగాలేదంటే అది భంపర్ హిట్టే!
టైటిల్ విని పూరీకి, బాలయ్య కు మధ్య ఏమైనా రిలేషన్ ఉందని ఊహించుకోవద్దు త్వరలో వీరిద్దరు కలిసి బెల్లంకొండ నిర్మాణ సారథ్యంలో చేయనున్న చిత్రానికి 'అనుచరుడు" అనే టైటిల్ ని పూరీ సెలక్ట్ చేశాడని వార్తలు వస్తున్నాయి. పూరీ నోటితో చిత్ర కథ అంతా విన్న బాలయ్య మంచి టైటిల్ కూడా మీరే సెలక్ట్ చేయండి అని చెప్పాడని గత కొన్ని రోజుల క్రితం వార్త బయటకు వచ్చిన విషయం తెలిసిందే..
మరి బాలయ్య చిత్రం అనగానే టైటిల్ వింటేనే సగం సినిమా చూసినట్లుగా ఉంటుందని వినికిడి..మరి 'అనుచరుడు" అనే పూరీ టైటిల్ అభిమానులకు అంతగా నచ్చకపోయినా బాలయ్యకు మాత్రం నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్య హీరోలు మాస్ ఇమేజ్ నుండి బయటపడాలని అనుకుంటున్నారు కదా!
ఈ ప్రకారం చూస్తే బాలయ్యకు ఈ టైటిల్ బాగా నచ్చే అవకాశం ఉంది. అయినా పూరీ టైటిల్స్ అంటేనే చాలా వైరైటీ గా ఉంటాయి. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం మరియు ఇడియట్, పోకిరి వంటి తిట్లను పేర్లుగా పెట్టినా సినిమా విడుదలకు ముందు టైటిల్స్ బాగోలేదని కొంతమంది వాదించినా అవి సూపర్ డూపర్ హిట్ అయి కూర్చుంటాయి. మరి బాలయ్య చిత్రానికి 'అనుచరుడు" బాగా లేదని వార్తలొస్తే ఈ చిత్రం భంపర్ హిట్ అయినట్లే అని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











