తులసీ వనంలో ...బాలకృష్ణ 101 చిత్రం షూటింగ్ ప్రారంభమైంది
బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషనల్లో తెరకెక్కనున్న చిత్రం ఇవాళ ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది.
హైదరాబాద్:బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషనల్లో తెరకెక్కనున్న చిత్రం ఇవాళ ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. బాలకృష్ణకు ఇది 101వ చిత్రం కావడం విశేషం.ఇవాళ ఉదయం కూకట్‌పల్లి తులసీవనంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది.

ఈ చిత్రం ప్రారంభోత్సవం కార్యక్రమంలో బాలకృష్ణ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బాలకృష్ణ, పూరి జగన్నాథ్, దర్శకులు క్రిష్, బోయపాటి శ్రీను, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'గౌతమిపుత్ర శాతకర్ణి' విజయంతో ఉత్సాహంగా ఉన్న బాలకృష్ణ తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారన్న వూహాగానాలకు కొద్దిరోజుల క్రితం పూరి జగన్నాథ్ తెరదించారు. బాలకృష్ణ 101 చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని.. మార్చి 9న చిత్రాన్ని ప్రారంభించి.. సెప్టెంబర్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు.

బాలయ్య తన వందో సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంతో అభిమానుల ఆనందాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లగా, 101వ సినిమాపై కొన్నాళ్లుగా సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ఫైనల్ గా 101 వ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించనున్నట్టు ప్రకటించేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా రూపొందనున్న ఈ చిత్రం పై అంచనాలు క్రియేట్ అవటం ఖాయం.

ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతూ మేకర్స్ కాస్టింగ్ కాల్ ఇచ్చారు. 23 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య ఉన్న మేల్, ఫీమేల్ వ్యక్తులు ఈ చిత్రంలో నటించే గొప్ప ఛాన్స్ అందుకోవచ్చంటూ తెలిపారు. ఇక ఈ చిత్రంలో విలన్ గా పూరీ కొత్త వ్యక్తిని తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. మరి ఆసక్తి గల వారు మీ కంప్లీట్ ప్రొఫైల్ ని [email protected] కి పంపించి, బాలయ్య సినిమాలో నటించే గొప్ప ఛాన్స్ అందుకోవచ్చని తెలిపారు.


Click it and Unblock the Notifications











