నయనానందకరంగా ఉన్న బాలయ్య రాముడిని చూడాలని ఉందా..?!
శ్రీరామ నామం మరువాం మరువాం... అంటూ మనం పాడుకుంటున్నామంటే కారణం ఆదర్శప్రాయమైన శ్రీరామచంద్రడని వ్యక్తిత్వమే. పాలన ప్రస్తావన వచ్చిందంటే రామరాజ్యం అనే మాట లేకుండా సంభాషణ ముగియదు"అన్నారు యలమంచి సాయిబాబా. ఆయన నిర్మిస్తున్న భక్తిరసాత్మక చిత్రం 'శ్రీరామరాజ్యం". బాపు దర్శకత్వం వహించారు. శ్రీరాముడిగా బాలకృష్ణ, సీతా దేవిగా నయనతార కనిపించనున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత సాయిబాబా చిత్ర విశేషాలు తెలియజేస్తూ' ఎన్ని తరాలు మారినా అందరికీ ఆదర్శం నీలమేఘ శ్యాముడి చరిత్ర. పితృవాక్య పరిపాలకుడిగా కీర్తి పొందిన ఆ శ్రీరాముడిని మరో సారి వెండి తెరపై ఆవిష్కరిస్తున్నాం. జనరంజక పాలనను అందించిన శ్రీరాముడి దక్షతను బాపు రమ్యంగా ఆవిష్కరించారు. రాముడి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారు.
రాముడి గెటప్ లో బాలకృష్ణ ఎలా ఉంటారనే ఆత్రుత నందమూరి అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులకు కూడా ఎక్కువగా ఉంది. కాగా రాముడి గెటప్ కి సంబంధించిన లుక్ ని ఈ నెల 31న అధికారికంగా విడుదల చేయడానికి ఈ యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇది నందమూరి అభిమానులను సంతోషపెట్టే వార్త అని చెప్పొచ్చు..ఈ చిత్రంలోని ప్రతి పాట ప్రేక్షకులకు తన్మయత్వాన్ని కలిగిస్తుంది. ఈ చిత్రం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో తీర్చిదిద్దిన సెట్స్ నయనానందకరంగా వుంటాయి. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తాయి. ఈ మహత్తర దృవ్యకావ్యాన్ని భగవత్సంకల్పంతో తెరకెక్కించాం. చిత్రాన్ని నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం" అన్నారు.


Click it and Unblock the Notifications











