బాలకృష్ణ - రవితేజ బాక్సాఫీస్ ఫైట్
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ మహరాజా రవితేజ మరోసారి బాక్సాఫీసు వద్ద ఫైట్‌కు సిద్దం అవుతున్నారు. బాలకృష్ణ ముఖ్య పాత్రలో నటించిన 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం ఆగస్టు 2న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో హీరో మనోజే అయినా బాలయ్య నటిస్తుండటంతో సినిమాపై క్రేజ్ పెరిగింది. చిత్ర నిర్మాతలు కూడా బాలయ్య పేరును వాడుకునే మార్కెట్ చేస్తున్నారు. రవితేజ నటించిన 'దేవుడు చేసిన మనుషులు' ఆగస్టు 3న విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సారి బాక్సాఫీసు వద్ద ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తిగా మారింది.
బాలకృష్ణ ముఖ్య పాత్రలో నటిస్తున్న 'ఊకొడతారా ఉలిక్కి పడతారా' చిత్రానికి శేఖర్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య ఆత్మరూపంలో కనిపిస్తారని, గాంధర్వ మహల్‌లోకి హీరో మంచు మనోజ్ ఎంటర్ అవ్వగానే సినిమా ఆసక్తికరంగా మారుతుందని తెలుస్తోంది. బాలయ్య ఆత్మరూపంలో జమిందారు పాత్రలో కనిపించడం, బాలయ్య క్యారెక్టర్ కోసం రూ. 6 కోట్లతో గాంధర్వ మహల్ సెట్ వేయడం సినిమాపై అంచనాలు పెంచుతోంది. మనోజ్ గెటప్ కూడా కొత్తగా ఉండటం సినిమాకు మరో ప్లస్ పాయింట్.
ఇక రవితేజ-పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటే ఎంటర్ టైన్మెంటుకు మారు పేరు. వీరి కాంబినేషన్లో వచ్చిన గత సినిమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. తాజాగా ఫన్నీ సబ్జెక్టుతో అసలు స్టోరీనే లేకుండా ఈచిత్రాన్ని రూపొందించాడు పూరి. రవితేజ నటన, బ్రహ్మానందం కామెడీ, ఇలియానా అందచందాలు, పూరి డైలాగులు ఈచిత్రానికి మరింత వన్నె తేనున్నాయి. ఇప్పటికే విడుదలై ఈచిత్రం ఆడియో సూపర్ హిట్ అయింది.


Click it and Unblock the Notifications











