twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ, రవితేజ ఆ విషయంలో ఒకరికొకరు పోటీగా.....

    By Srikanya
    |

    హైదరాబాద్: బాలకృష్ణ, రవితేజ విషయంలో ఆ మధ్యన ఏదో వివాదం చాలా కాలం నలిగిందని మీడియాలో వినిపించింది. ఆ సంగతి ఎలా ఉన్నా ఇద్దరూ 2012లో మాత్రంలో ప్లాఫుల్లో పోటీ పడ్డారు. బాలకృష్ణ , రవితేజ కలసి ఇద్దరూ ఏడు ప్లాపులు ఇచ్చి, నిర్మాతలకు నష్టాలను మిగిల్చారు.

    బాలకృష్ణ నటించిన చిత్రాలు 2012లో మూడు విడుల అయ్యాయి. ఆ మూడు ఏమిటంటే... అధినాయకుడు, శ్రీమన్నారాయణ, ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలు. ఈ మూడు చిత్రాల్లో ఏ ఒక్కటీ ఆడలేదు. యావరేజ్ చిత్రాలు కూడా కాలేకపోయాయి. ముఖ్యంగా అథినాయుకుడు చిత్రంపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే మూడు ప్లాపు అయ్యాయి.

    రవితేజ విషయానికి వస్తే.. బాలకృష్ణ కంటే మరో చిత్రం ఎక్కువే విడుదల అయ్యింది. రవితేజ నటించిన 4 చిత్రాలు 2012 లో విడుదల అయ్యాయి. అవి... నిప్పు, దరువు, దేముడు చేసిన మనుష్యులు, సారొచ్చారు చిత్రాలు. ఈ చిత్రాలు నాలుగు యావరేజ్ లు కాలేక బోల్తా పడ్డాయి. రవితేజ తో చిత్రం మినిమం ప్లాపు అన్న స్ధితికి మార్కెట్ వచ్చేసింది.

    ఇక 2012 మాత్రం మెగా హీరోలకు బాగా కలిసి వచ్చింది. ఆరెంజ్ ఫ్లాప్ తర్వాత వచ్చిన రచ్చ పెద్ద హిట్టైంది. తర్వాత అల్లు అర్జున్ కి నాలుగు ప్లాపు ల తర్వాత జులాయితో నిలదొక్కుకున్నాడు. జల్సా తర్వాత హిట్ లేకుండా ఉన్న పవన్ కి గబ్బర్ సింగ్ తో మెగా హిట్ అందింది. 2012 లో ఎక్కువ కలెక్టు చేసిన చిత్రంగా గబ్బర్ సింగ్ తన సత్తా చాటుకుంది. వీటికి తోడు మెగాస్టార్ చిరంజీవికి కేంద్రపదవి కూడా ఈ సంవత్సరమే దొరికింది.

    English summary
    Apparently in the year 2012, most of the heroes tasted average to hit movies. But only two men scored record flops. They are the duo of Nandamuri Balakrishna and Ravi Teja. Both gave super flops. Ravi Teja registered a whopping four flops (Daruvu, Nippu, Devudu Chesina Manushulu and Sarocharu) in this year alone. And Balayya scored flops this year with Adhinayakudu, Uu Kodathara Ulikki Padathara and Srimannarayana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X