హరికృష్ణ మృతి: ఆసుపత్రికి చేరుకున్న బాలకృష్ణ.. వరుసగా నందమూరి కుటుంబ సభ్యులు!
Recommended Video

నందమూరి హరికృష్ణ నేటి ఉదయం నల్గొండ సమీపంలో అన్నెపర్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. హరికృష్ణ మరణంతో కుటుంబ సభ్యులు, సినీ వర్గాలు, అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఊహించని శోకం ఎదురుకావడంతో హరికృష్ణ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇంత ఘోరమైన ప్రమాదం జరగడానికి గల కారణాలు అతివేగమే అని వార్తలు వస్తున్నాయి.

ఆసుపత్రికి బాలయ్య
తన సోదరుడు హరికృష్ణ మరణవార్త తెలియగానే నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. కొద్ది సేపటి క్రితమే బాలయ్య నార్కెట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి వచ్చారు.

నందమూరి కుటుంబ సభ్యులు
హరికృష్ణ మృతి చెందిన వార్త తెలియగానే నందమూరి కుటుంబ సభ్యులంతా ఆసుపత్రికి బయలుదేరినట్లు తెలుస్తోంది. పురందేశ్వరి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆసుపత్రికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తీవ్రశోకంతో ఇది వరకే ఆసుపత్రికి చేరుకున్నారు.

కైకాల సత్యనారాయ
హరికృష్ణ మృతి పట్ల సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సీనియర్ నటుడు కైకాల సత్యనారాణయ మాట్లాడుతూ ఎన్టీఆర్ తనని సొంత తమ్ముడికంటే ఎక్కువగా చూసేవారని తెలిపారు. హరికృష్ణ ఎప్పుడూ బాబాయ్ అంటూ ఆప్యాయంగా పలకరించేవాడు.

ఆకస్మిక మరణం
హరికృష్ణ ఆకస్మిక మరణం తనని తీవ్ర మనోవేదనకు గురిచేస్తోందని కైకాల సత్యనారాయణ అన్నారు. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా హరికృష్ణ మృతికి సంతాపం తెలియజేశారు. ప్రమాదం జరిగిన తీరు చాలా భయంకరంగా ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications











