అలా క్యాష్ చేసుకునే స్థాయికి దిగజారనన్న బాలయ్య, ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై నవ్వుతూ...
మహానటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర ఆయన తనయుడు బాలకృష్ణ పోషిస్తుండగా... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు.
రెండు భాగాలుగా రాబోతున్న ఈ బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు'లో ఎన్టీఆర్ బాల్యం, సినీ రంగ ప్రవేశం, స్టార్‌గా ఎదిగిన వైనం చూపించబోతున్నారు. రెండో భాగం 'ఎన్టీఆర్-మహానాయకుడు'లో రాజకీయరంగ ప్రవేశం, పార్టీ పెట్టిన కిన్ని నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం లాంటివి ఉండబోతున్నాయి. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని వివాదాస్పద అంశాలను చూపించడం లేదు.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య స్పందించారు
ఎన్టీఆర్ జీవితంలోని వివాదాస్పద అంశాలను బయోపిక్‌లో చూపించడం లేదు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఆ వివాదాలను కథగా మలిచి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. రామారావును వెన్నుపోటు పొడిచిన ఉదంతాన్ని ఈ చిత్రంలో ప్రధానంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాపై బాలకృష్ణ స్పందించారు.

నవ్వుతూ రియాక్ట్ అయిన బాలయ్య
‘ఎన్టీఆర్ బయోపిక్' చిత్రానికి సంబంధించి ప్రమోషన్లలో బిజీగా ఉన్న బాలయ్యను కొందరు పాత్రికేయులు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం మీద స్పందించాలని కోరగా.... ఆయన నవ్వుతూ సమాధానం ఇవ్వడం గమనార్హం.

అది ఆయన వ్యక్తిగతం
రామ్ గోపాల్ వర్మ ఏం కథతో సినిమా తీస్తున్నారో తెలియదు. అందులో ఎలాంటి కోణం ఉంటుందో కూడా తెలియదు. దీని గురించి ఆయన నన్ను సంప్రదించలేదు. ఎవరు ఎలాంటి సినిమా అయినా తీయొచ్చు. అది ఆయన వ్యక్తిగతం అని బాలయ్య వ్యాఖ్యానించారు.

నా కంటే ప్రజల అభిప్రాయమే ముఖ్యం
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై మీ రియాక్షన్ చెప్పాలని మీడియా వారు కోగా... ‘‘ఈ సినిమాపై నా రియాక్షన్ కంటే ప్రజలు, ప్రేక్షకుల రియాక్షనే ముఖ్యం'' అని బాలకృస్ణ స్పష్టం చేశారు. ఇంతకు మించి మాట్లాడటానికి బాలయ్య ఇష్టపడలేదు.

అలా క్యాష్ చేసుకునే స్థాయికి దిగజారను
మరో ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. నాన్నగారి వ్యక్తిగత విషయాలు, సొంత విషయాలు పక్కన పెట్టి చూడాలి. కానీ అటువంటి వాటిని కూడా సినిమాగా క్యాష్ చేసుకుంటున్నారు. ఆ స్థితికి నేను దిగజారను. కొంతమంది తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. లోకం తీరే అంత'' అన్నారు.


Click it and Unblock the Notifications











