Balakrishna: 'తొక్కినేని'పై బాలయ్య రియాక్షన్.. ఫ్లోలో అంటే ఇలా చేస్తారా, అక్కడ మర్యాద లేదు!

నందమూరి నటసింహం తాజాగా వీర సింహా రెడ్డి సినిమాతో సక్సెస్ కొట్టాడు. ఈ సందర్భంగా వీర సింహా రెడ్డి విజయోత్సాహం నిర్వహించి విజయాన్ని అందరితో పంచుకున్నారు. ఇదంతా బాగానే జరిగింది. కానీ ఈ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఊహించని విధంగా వివాదాస్పదంగా మారాయి. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ సైతం ఈ విషయంపై ఎలాంటి పేరు చెప్పకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే తాజాగా తాను అక్కినేని తొక్కినేని అని అనడంపై స్పందించారు బాలయ్య బాబు.

వీర సింహా రెడ్డి కార్యక్రమంలో..

వీర సింహా రెడ్డి కార్యక్రమంలో..

నందమూరి నటసింహం బాలయ్య బాబు ఇటీవల వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ కార్యక్రమంలో మాట్లాడిన విధానం హాట్ టాపిక్ గా మారింది. ఆయన సినిమా గురించి చెబుతూ అలాగే తోటి ఆర్టిస్టులతో కూడా మాట్లాడే విధానంపై కూడా ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సెట్ లో ఉండే ఆర్టిస్టులు అందరూ కూడా తనకు ఎంతో టైం పాస్ గా ఉంటారు అని చాలా విషయాల గురించి మాట్లాడుకుంటాము అని బాలయ్య చెప్పుకుంటా వెళ్లారు.

 అక్కినేని తొక్కినేని..

అక్కినేని తొక్కినేని..

"మా ఆర్టిస్టులు అంత నాకు మంచి టైమ్ పాస్ , వేదాలు శాస్త్రాలు నాన్నగారి డైలాగ్ లు, సినిమాలు.. ఆ రంగారావు ఈ అక్కినేని తొక్కినేని ఇవన్నీ కూర్చొని మాట్లాడుకునేవాళ్లం" అని నందమూరి బాలకృష్ణ ఊహించని విధంగా మాట్లాడారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలా అక్కినేని తొక్కినేని అనే మాట మాట్లాడడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

 మనమే కించపరుచుకోవడం..

మనమే కించపరుచుకోవడం..

ఇటీవల అక్కినేని వారసులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ అన్న వ్యాఖ్యలపై స్పందించారు. "నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామాతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం.." అంటూ వారు వారి సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

 రెండు కళ్లలాంటి వాళ్లు..

రెండు కళ్లలాంటి వాళ్లు..

అలా బాలకృష్ణ వ్యాఖ్యలకు పరోక్షంగా అక్కినేని వారసులు కౌంటర్ ఇచ్చినట్లు అయింది. అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్ ఇద్దరు కూడా ఒకేసారి ఆ విధంగా ట్విట్ చేయడంతో సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. అంతేకాకుండా ఎమ్మెల్యే రోజా కూడా బాలకృష్ణ వైఖరీపై మండిపడింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరు తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటి వారు.. అలా మాట్లాడితో వాళ్ల అభిమానులకు, కుటుంబానికి బాధగానే ఉంటుదన్నారు.

 ఫ్లోలో వచ్చింది..

ఫ్లోలో వచ్చింది..

తాజాగా ప్రచారాలపై బాలయ్య బాబు స్పందించారు. హిందూపూంలో ఉన్న బాలకృష్ణను ఈ విషయంపై అడగ్గా.. సమాధానం ఇచ్చారు. "ఎన్టీ రామారావును ఎన్టీవోడు అంటారు.. నాగేశ్వరరావును నాగీగాడు అంటారు.. ఒక్కొక్క రాష్ట్రం.. ఒక్కొక్క యాస.. అభిమానంతో అలా అంటారు. అప్పుడు ఏదో ఫ్లోలో వచ్చింది. నాగేశ్వరరావు నాకు ఎప్పుడూ బాబాయే. నేనంటే ఆయనకు ఎప్పుడూ ఇష్టమే" అని బాలకృష్ణ తెలిపారు.

పొగడ్తలకు దూరంగా ఉండటం..

పొగడ్తలకు దూరంగా ఉండటం..

ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఆయన పిల్లలకంటే ఎక్కువ ప్రేమగా నన్ను చూసుకునేవారు. ఆయన్ను పలకరించేవాన్ని నేను. ఆప్యాయంగా పలకరించేవాన్ని. ఎందుకంటే అక్కడ లేదు. ఇక్కడ ఉంది. అది గుర్తి పెట్టుకోండి. నాగేశ్వర రావు అంటే ఇవాళ్టికి మాకు అభిమానం. ఆయన మహా నటుడు. ఇండస్ట్రీకి ఇద్దరు రెండు కళ్లలాంటివాళ్లు. నాన్న నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండటం అనే విషయాన్ని నేర్చుకున్నాను. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే సంబంధం లేదు అని పేర్కొన్నారు.

 ప్రేమ గుండెల్లో ఉంటుంది..

ప్రేమ గుండెల్లో ఉంటుంది..

ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగింది. బాబాయ్ పై ప్రేమ గుండల్లో ఉంటుంది. బయట ఏం జరిగినా పట్టించుకోనవసరం లేదు అని బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X