హీరోయిన్స్ ని చూస్తుంటే నా పేరు సార్ధకం ..బాలకృష్ణ
''ఇంతమంది హీరోయిన్స్ అందరూ కలసి నాకు అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది. నా పేరు సార్థకం చేసుకొన్నాను అనిపిస్తోంది అన్నారు నందమూరి బాలకృష్ణ. రీసెంట్ గా ఆయన 'సింహా' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా 'సంతోషం' అవార్డును అందుకొన్నారు. వేదిక మీద ఉన్న హీరోయిన్స్ అంతా బాలకృష్ణకు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన ఇలా స్పందించారు.అదే వేదికపై మాట్లాడుతూ.. ''ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగానే సినిమాలు తీయాలి. ఇప్పుడు నటులంటే నిత్యావసర వస్తువుల్లాంటివాళ్లు. సినిమా అంటే జనం జీవితంలో భాగం అయిపోయింది. వాళ్లకు ఏయే విషయాలు నచ్చుతాయో వాటిని మేళవిస్తే విజయం అందుతుంద అన్నారు. అలాగే 'సింహా' చిత్ర యూనిట్ కి కృతజ్ఞతలు. ముఖ్యంగా దర్శకుడు బోయపాటి శ్రీను అన్నీ తానై నడిపించాడు'' అని మెచ్చుకున్నారు.ఇక ఇదే వేదికపై ఉత్తమ నటిగా అనుష్క (వేదం) అవార్డు అందుకుంది. దర్శకుడు బాపు లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డును అందుకొన్నారు.


Click it and Unblock the Notifications











