NTR శత జయంతి ఉత్సవాలపై బాలకృష్ణ కీలక ప్రకటన.. ఎన్ని రోజులపాటు నిర్వహణ అంటే?

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నలుదిశలా చాటిన మహోన్నత వ్యక్తి, సినీ నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇక శత జయంతి ఉత్సవాలను ఆయన జన్మస్థలం నిమ్మకూరులో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమవుతోండగా ఈ విషయానికి సంబంధించి బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

తల ఎత్తి నిలబడింది

తల ఎత్తి నిలబడింది

నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా బాలకృష్ణ షేర్ చేసిన సందేశం యధాతదంగా ''అభిమానులకు, తెలుగు నేలకు.. విశ్వవ్యాప్తంగా వెలుగు లీనుతున్న తెలుగు జాతికి.. నందమూరి బాలకృష్ణ నమస్సుమాంజలి, మా నాన్నగారు సినీ రంగంలో అడుగు పెట్టారు. భారతీయ సినిమా తెలుగు సినిమాని తల ఎత్తి చూసింది.. తెలుగుదేశం పార్టీని స్థాపించారు.. తెలుగు సంస్కృతి తల ఎత్తి నిలబడింది'' అని పేర్కొన్నారు.

కుటుంబం నుంచి నెలకొక్కరు

కుటుంబం నుంచి నెలకొక్కరు

ఆ నందమూరి తారక రాముడికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది.. ఆ రోజు నుంచి, 2023 మే 28 వరకు, 365 రోజుల పాటు శత పురుషుడు శత జయంతి వేడుకలు నేల నలుచెరుగులా జరుగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను'' అని బాలకృష్ణ పేర్కొన్నారు. ''మునుపెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఎన్నో దేశాల్లో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది.. ఆనందంలో పాలు పంచుకుంటుంది, మా కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారు'' అని అన్నారు.

365 రోజులు

365 రోజులు

''ఇందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్ళి, అక్కడి వేడుకల్లో పాల్గొంటారు. వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత, అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుంటాను. అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను నా చేతుల మీద ప్రారంభిస్తున్నాను.. 365 రోజులు.. వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు.. నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు'' ఉంటాయని పేర్కొన్నారు.

 సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

''ఈ మహత్కార్యాన్ని పెమ్మసాని(రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి, ఒంగోలు వెళ్ళి మహానాడు లో పాల్గొంటానని తెలుగుజాతికి తెలియజేస్తున్నాను.'' అని బాలకృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ఇటీవల వచ్చిన అఖండ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయన ఇప్పుడు వరుస సినిమాల లో నటిస్తున్నారు.

రెండో సీజన్ కు రంగం సిద్ధం

రెండో సీజన్ కు రంగం సిద్ధం

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆయన ప్రస్తుతం nbk 107 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తి అయ్యాక ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. సినిమాల తో పాటు బాలయ్య టాక్ షోల తో దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే మొదటి సీజన్ పూర్తి కాగా రెండో సీజన్ కు రంగం సిద్ధం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X