‘అధినాయకుడు’లోనూ గుడివాడ సెంటిమెంటు
సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషయాల్లో సెంటిమెంటును బాగా ఫాలో అవుతుంటారు హీరోలు. తాజాగా బాలయ్య కూడా అదే చేస్తున్నాడు. తనకు బాగా కలిసొచ్చిన గుడివాడ సెంటిమెంటును రిపీట్ చేస్తున్నాడు. బాలయ్య గతంలో నటించిన 'రౌడీ ఇన్స్ స్పెక్టర్', 'బంగారు బుల్లోడు' చిత్రాల్లోని పాటల్లో గుడివాడ ఊరుపేరు వచ్చేలా చూసుకున్నాడు. దాంతో ఆ రెండు సినిమాలు పెద్ద హిట్టయ్యాయి. ఈ చిత్రంలో 'గుడివాడ గుంటది' అంటూ సాగే పాట కూడా మంచి హిట్టయింది. తాజాగా తన 'అధినాయకుడు' చిత్రంలోనూ గుడివాడ ప్రస్తావన వచ్చేలా చూసుకున్నాడు బాలయ్య. సెంటిమెంటు వర్కౌట్ అయితే సినిమా హిట్టవుతుందనేది ఆయన నమ్మకంగా కనిపిస్తోంది.
అధినాయకుడు చిత్రంలో బాలయ్య తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. లక్షీరాయ్, సలోని ఇందులో కథానాయికలు. పరుచూరి మురళి దర్శకత్వంలో శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏర్పిల్ నెలలో ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
బాలకృష్ణ ఇమేజ్ ను, బాడీలాంగ్వేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కథ ఇది. ఆయన అభిమానులను రంజింపచేసే అన్ని అంశాలకు ఇందులో పెద్ద పీట వేశామని దర్శక నిర్మాతలు అంటున్నారు. బాలయ్య నటన, యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సీన్స్, వినోదం, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఎంటర్‌టైన్ చేసేలా సినిమాను రూపొందించారు. జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్ రాజ్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి, సంగీతం: కళ్యాణి మాలిక్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: సందీప్.


Click it and Unblock the Notifications











