రోజంతా ‘రోజా’తోనే గడుపుతున్న బాలయ్య
'బొబ్బిలిసింహం"-'భైరవద్వీపం" వంటి చిత్రాలతో హిట్ పెయిర్ అనిపించుకున్న బాలకృష్ణ-రోజాలు మళ్ళీ కలిశారు..కలిసి నటిస్తున్నారు. అయితే ఈసారి చేసేది హీరో హీరోయిన్స్ గా కాదులెండి. దాసరి దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న 'పరమవీర చక్ర" చిత్రంలోని ఓ పవర్ ఫుల్ రోల్ ని రోజాకి ఇవ్వడం జరిగింది. కాగా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో బాలయ్య-రోజాల కాంబినేషన్ సీన్స్ నే కంటిన్యూస్ గా పిక్ఛరైజ్ చేస్తున్నారు దాసరి.
మరి చాన్నాళ్ళ తర్వాత కలిశారనేదే కారణమో..లేక చెప్పుకోవడానికిప్పుడు చాలా టాపిక్స్ వుండడం వలనో తెలీదు కానీ సెట్ లో మాత్రం బాలయ్య-రోజాల ముచ్చట్లు గంటల తరబడి సాగుతున్నాయి. ఆల్ మోస్ట్ రోజంతా రోజా కబుర్లతోనే కాలక్షేపం చేస్తోన్న బాలకృష్ణకు ఆమె ఏం చెబుతోందో..ఎవరి గురించి మట్లాడుతోందో మీరూ ఈజీగానే గెస్ చెయ్యగలరు కదూ..!
బాలకృష్ణ రోజా పరమవీర చక్ర దాసరి నారాయణ రావు బైరవద్వీపం balakrishna roja paramaveera chakra dasari narayana rao biravadeepam


Click it and Unblock the Notifications