బాలకృష్ణ సైతం...
పౌరాణిక చిత్రాలతో స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగువారి గుండెల్లో నిలిచిపోయాడు. పౌరాణిక చిత్రాలలో నటించేపుడు తారకరామారావు కొన్ని నియమాలు పాటించేవాడు. సినిమా పాత్రను బట్టి సినిమా పూర్తయ్యేదాకా మాంసాహారం లాంటి వాటిని ముట్టేవాడు కాదు. అదేబాటలో ఆయన తనయుడు బాలకృష్ణ కూడా పయణిస్తున్నాడు. తాజాగా రంగా పాండురంగా సినిమాలో బాలకృష్ణ శ్రీకృష్ణుని పాత్రను పోషిస్తున్నాడు. ఆ పాత్ర కోసం మీసాలు తీసిన బాలకృష్ణ కూడా మాంసాహారం, విలాసవంతమైన జీవితానికి తాత్కాలికంగా దూరంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నాడు. కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు జెకె భారవి కథను అందస్తుండగా కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.


Click it and Unblock the Notifications