నందమూరి అందగాడు బాలకృష్ణ ఒకేసారి ఏడుగురి భామలతో రొమాన్స్..
ఇండస్ట్రీ మొత్తం హీరోయిన్ల కొరతను ఎదుర్కొంటూ వుంటే నందమూరి అందగాడు బాలకృష్ణ మాత్రం ఒకేసారి ఏడుగురి భామలతో ఆడిపాడతానంటున్నాడు. ప్రస్తుతం తను చేస్తోన్న 'పరమవీర చక్ర" లోనే అమీషా పటేల్ షీలా, నేహా ధూఫియాల రూపంలో ముగ్గురు కథానాయికలు నటించనున్నారు. ఆల్ రెడీ ఈ చిత్రం కోసం భూమికను ఓ నాయికగా ఎంపిక చేశారు కానీ తనది అందులో కేవలం ఓ పాటకీ, మూడు సీన్స్ కీ మాత్రమే పరిమితమయ్యే పాత్రని తెలిసింది.
కాగా ఇప్పుడా చిత్రం కోసం మిగిలిన ముగ్గురు హీరోయిన్లనీ ఫైనలైజ్ చేసే పనిలో తలమునకలైవున్నారు నిర్మాత ఎం ఎల్ కుమార్ చౌదరి. సో అక్కడో ముగ్గురితో ఇక్కడో నలుగురితో మొత్తంగా ఏడుగురు ముద్దుగుమ్మలతో కలిసి నటించేందుకూ..నర్తించేందుకూ నందమూరి నటసింహం సిద్దంగా ఉందన్నమాట..!
బాలకృష్ణ భూమిక అమీషా పటేల్ నేహా ధూపియా షీలా కుమార్ చౌదరి దాసరి నారాయణ రావు balakrishna bhumika amisha patel neha dhupia sheela kumar chowdary dasari narayana rao


Click it and Unblock the Notifications