»   » లక్ష్మీరాయ్ తో బాలకృష్ణ హాట్ రొమాన్స్..?

లక్ష్మీరాయ్ తో బాలకృష్ణ హాట్ రొమాన్స్..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ ఓ స్టార్ హీరో అయినా అతని సరసన నటించడానికి కథానాయికలు అంత ఆసక్తిని కనభరచరన్న సంగతి తెలిందే. అందులో ప్రస్తుత జనరేషన్ లో వస్తున్న హీరోయిన్స్ అయితే మరి బెంబేలెత్తిపోతారు. ఒకసారి నటించిన తర్వాత చాలా మంది అతనికి ఎందుకు దూరంగా ఉంటారో బాలకృష్ణకీ తెలుసు. ప్రస్తుతానికి టాప్ హీరోయిన్లు దక్కకపోతే సెకండ్ గ్రేడ్ హీరోయిన్లు, ఒకటి రెండు సినిమాలతో కనుమరుగవుతున్న హీరోయిన్లతో కాలక్షేపం చేస్తున్న బాలకృష్ణ త్వరలో లక్ష్మీరాయ్ తో రొమాన్స్ చేయబోతున్నాడు.

పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఒక నాయికగా లక్ష్మీరాయ్ నటిస్తుంది. ఇందులో మరో నాయికగా భూమిక ఎంపికయింది. కాంచనమాల కేబుల్ టీవీ చిత్రంలో టాలీవుడ్ తో కనెక్షన్ ఏర్సడ్డాక లక్ష్మీరాయ్ చెన్నయ్ కి షిఫ్ట్ అయింది లారెన్స్ కి బాగా క్లోజ్ అయిన లక్ష్మి ప్రస్తుతం అతనికే అంకితమైంది. అయితే అనూహ్యంగా బాలకృష్ణ సినిమాలో నటించే అవకాశం దక్కడంతో ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది. సాక్షాత్తు హీరోగారే రికమండ్ చేస్తే ఇక అడ్డుఅదుపు ఏముంది? మరి ఈ చిత్ర నిర్మాత ఎం ఎల్ కుమార్ చౌదరి ఖచ్చితంగా లక్ష్మీరాయ్ నే తీసుకుంటాడని చెప్పొచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu