స్పీడ్ పెంచిన బాలయ్య.. ఏకంగా నలుగురితో రోమాన్స్.. హీరోయిన్లు వీరే..

నటసింహం నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం తర్వాత దూసుకెళ్తున్నాడు. పూరీతో 101వ చిత్రాన్ని వేగం పూర్తి చేసిన బాలయ్య.. అంతే వేగంతో 102వ సినిమాను శరవేగంతో పూర్తి చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్

By Rajababu

నటసింహం నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం తర్వాత దూసుకెళ్తున్నాడు. పూరీతో 101వ చిత్రాన్ని వేగం పూర్తి చేసిన బాలయ్య.. అంతే వేగంతో 102వ సినిమాను శరవేగంతో పూర్తి చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ సీన్లను ఇటీవల పూర్తి చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఈ ఈ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ల గురించి ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేమిటంటే..

102 చిత్రంలో నలుగురు హీరోయిన్లు

102 చిత్రంలో నలుగురు హీరోయిన్లు

బాలకృష్ణ తన 102వ చిత్రాన్ని స్టార్ దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రంలో ఏకంగా నలుగురు హీరోయిన్లను బాలయ్య కోసం బుక్ చేశారనేది తాజా సమాచారం. గత చిత్రం పైసా వసూల్‌ చిత్రంలో ముగ్గురితో రొమాన్స్ చేసిన బాలయ్య.. ఈ సారి హీరోయిన్ల సంఖ్య పెంచడం గమనార్హం.

Recommended Video

బాలకృష్ణ చేతులమీదుగా గరుడవేగ ట్రైలర్..
మెయిన్ హీరోయిన్‌గా నయన తార

మెయిన్ హీరోయిన్‌గా నయన తార

బాలయ 102వ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా నటాషా డోరి నటిస్తున్నది. ఇక పిల్లా జమిందార్, అబ్బాయి క్లాస్, అమ్మాయి మాస్ లాంటి చిత్రంలో నటించిన హరిప్రియ కూడా బాలయ్య పక్కన నటించే అవకాశం కొట్టేసినట్టు తెలుస్తున్నది.

రెజీనా రంగ ప్రవేశం

రెజీనా రంగ ప్రవేశం

ఈ ముగ్గురి హీరోయిన్ల కథ ఇలాగా ఉంటే.. మరో అందాల తార రెజీనా కసాండ్రా కూడా త్వరలో ఈ ప్రొడక్షన్‌లో చేరబోతున్నది. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటించడంపై అంతగా ఈ కథలో ఏముందో అనే ఆసక్తి నెలకొన్నది.

బాలకృష్ణతో క్లైమాక్స్ ఎపిసోడ్స్

బాలకృష్ణతో క్లైమాక్స్ ఎపిసోడ్స్

ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్ సికె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ నిన్నటితో ముగిసింది. అరివుమణి-అంబుమణిల సారథ్యంలో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ లు బాలయ్యపై చిత్రీకరించారు. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, న‌యన‌తార‌, న‌టాషా, హరిప్రియ, ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ముర‌ళీ మోహ‌న్‌, జేపీ, ఎల్బీ శ్రీ‌రామ్‌ల‌తో పాటు ఇత‌ర‌ ప్ర‌ధాన తారాగ‌ణం కూడా పాలుపంచుకొంది.

అక్టోబర్ 15 వరకు క్లైమాక్స్ ఎపిసోడ్

అక్టోబర్ 15 వరకు క్లైమాక్స్ ఎపిసోడ్

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "అక్టోబర్ 5న మొదలైన క్లైమాక్స్ ఎపిసోడ్ అక్టోబర్ 15 వరకూ నిరాటంకంగా షూట్ చేయడం జరిగింది. అరివుమణి-అంబుమణిలు అత్యంత నేర్పుతో సహజంగా ఉండేలా ఈ పోరాట సన్నివేశాలని డిజైన్ చేశారు. మూసాపేట్ లోని కంటైనర్ యార్డ్ లో ఈ కీలకమైన ఎపిసోడ్ ను షూట్ చేశాం. ఇప్పటికే నయనతార, నాటాషా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హరిప్రియ మరో కథానాయికగా కనిపించనుంది అన్నారు.

నటీ నటులు, సాంకేతిక నిపుణులు

నటీ నటులు, సాంకేతిక నిపుణులు

బాలకృష్ణ, నయనతార, న‌టాషా దోషీ, హరిప్రియ, ప్రకాష్ రాజ్, మురళీమోహన్, బ్రహ్మానందం, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, పోరాటాలు: అరివుమణి-అంబుమణి, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహ-నిర్మాత: సి.వి.రావు, ఎద్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వరుణ్-తేజ, నిర్మాణం: సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి, దర్శకత్వం: కె ఎస్ రవికుమార్!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X