బాలయ్య ఇంట పెళ్లి....బ్యాంకాక్‌ నుంచి పువ్వులు

By Srikanya

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం ఈ రోజు(బుధవారం) ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు వివాహ వేదిక సర్వాంగసురదరంగా రూపుదిద్దుకుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఈ కల్యాణానికి వేదిక అయ్యింది. ఈ ఉదయం 8.52గంటలకు వరుడు శ్రీభరత్‌, వధువు తేజస్విని మెడలో మూడుముళ్లు వేయనున్నారు. ఈ వేడుక కోసం సినీ కళాదర్శకుడు ఆనంద్‌సాయి నేతృత్వంలో కల్యాణ మండపాన్ని తీర్చిదిద్దారు. అలంకరణ కోసం బ్యాంకాక్‌ నుంచి ప్రత్యేకంగా పువ్వుల్ని తెప్పించారు.

Balakrishna ropes in top cine-technicians for daughter's wedding

ఓ ప్రక్క ఆధునికంగా ఉంటూ... తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా పెళ్లిని నిర్వహించేందుకు బాలకృష్ణ కుటుంబం ఏర్పాట్లు చేసింది. నందమూరి కుటుంబ సభ్యులంతా వేదికపై కూర్చునేలా పెద్ద మండపాన్ని సిద్ధం చేశారు. ప్రముఖులు, అభిమానుల కోసం ప్రత్యేక గ్యాలరీలను సిద్ధం చేశారు. పెళ్లి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు మండపం చుట్టూ ఎల్‌ఈడీ తెరలను సిద్ధం చేశారు.

ఆనంద్‌సాయి మాట్లాడుతూ ''పగటి పూట పెళ్లి కావడంతో లైటింగ్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఎరుపు, తెలుపు, పర్పుల్‌ రంగుల మేళవింపుతో అలంకరణ చేశాం. మరోకల్‌ డిజైనింగ్‌లో మండపాన్ని తీర్చిదిద్దాము''అని తెలిపారు.

18 అడుగుల ఎత్తున్న ఈ కల్యాణ మండపం సుమారు మూడు టన్నుల బరువు ఉంటుంది. ఈ మండప నిర్మాణం కోసం 300 మంది వారంరోజుల పాటు పని చేశారు. వివాహానంతరం నూతన దంపతులను అభిమానులకు పరిచయం చేసేందుకు అభిమానుల గ్యాలరీకి చేరడానికి ప్రత్యేకమైన లిఫ్టును ఏర్పాటు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X