పెళ్లి : బాలకృష్ణ...ఆత్మీయులతో...(ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం ఈ రోజు(బుధవారం) ఘనంగా జరుగుతోంది. ఇందుకు వివాహ వేదిక సర్వాంగసురదరంగా రూపుదిద్దుకుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఈ కల్యాణానికి వేదిక అయ్యింది. ఈ ఉదయం 8.52గంటలకు వరుడు శ్రీభరత్‌, వధువు తేజస్విని మెడలో మూడుముళ్లు వేసారు.

ఓ ప్రక్క ఆధునికంగా ఉంటూ... తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా పెళ్లిని నిర్వహించేందుకు బాలకృష్ణ కుటుంబం ఏర్పాట్లు చేసింది. బాలకృష్ణ స్వయంగా అతిధులందరినీ ఆహ్వానిస్తూ బిజీగా ఉన్నారు. ఈ పెళ్లికి ఆయన అల్లుడు, నందమూరి కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఇక నందమూరి కుటుంబ సభ్యులంతా వేదికపై కూర్చునేలా పెద్ద మండపాన్ని సిద్ధం చేశారు. ప్రముఖులు, అభిమానుల కోసం ప్రత్యేక గ్యాలరీలను సిద్ధం చేశారు. పెళ్లి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు మండపం చుట్టూ ఎల్‌ఈడీ తెరలను సిద్ధం చేశారు. ఈ వేడుక కోసం సినీ కళాదర్శకుడు ఆనంద్‌సాయి నేతృత్వంలో కల్యాణ మండపాన్ని తీర్చిదిద్దారు.

ఫోటోలు స్లైడ్ షోలో....

నందమూరి రామకృష్ణ

నందమూరి రామకృష్ణ

బాలకృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ తన కుటుంబంతో కలిసి పెళ్లికి విచ్చేసారు. తమ కుటుంబంలో జరుగుతున్న వివాహం కావటంతో మొదటి నుంచి ఆయన ఈ వివాహ పనులని కూడా పర్యవేక్షించారు.

కొడుకుతో...

కొడుకుతో...

నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞతో హడావిడీగా ఈ వివాహానికి హాజరైన వాళ్లని ఆహ్వానిస్తున్నారు. మోక్షజ్ఠ తన సోదరి వివాహం కావటంతో చాలా ఉత్సాహంగా పెళ్లి పనుల్లో పాల్గొన్నారు. పెళ్లికి వచ్చినవారందరి దృష్ణీ ఈ తండ్రి కొడుకులపైనే ఉంది..

బాలయ్యదే..

బాలయ్యదే..

ఈ పెళ్లిలో హడావిడి మొత్తం బాలకృష్ణదే. చాలా ఓపికగా అందరనీ దగ్గరుండి రిసీవ్ చేసుకుంటూ ఆయన మండపం దగ్గర కనిపించారు. అలాగే పెళ్లి పనుల్లో ఏ అసౌకౌర్యం కలగకుండా చూస్తున్నారు.

నారా లోకేష్...

నారా లోకేష్...

బాలకృష్ణ పెద్ద అల్లుడు ,చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఈ వివాహానికి హాజరయ్యి..కొన్ని పనుల్లో తన మామకు సహకారం అందించారు. అలాగే తెలుగుదేశం నాయకులను ఆయన దగ్గరుండి ఆహ్వానించారు.

నందమూరి కళ్యాణ్ రామ్...

నందమూరి కళ్యాణ్ రామ్...

ఈ వివాహానికి నందమూరి కళ్యాణ్ రామ్ తనదైన శైలిలో డ్రెస్ చేసుకుని సకుటుంబ సపరివారంగా హాజరయ్యారు. తన బాబాయ్ కు ఆయన చేదోడు,వాదోడుగా గత కొద్ది రోజులుగా పెళ్లి పనుల్లో ఉంటూ వస్తున్నారు.

మామ, అల్లుడు

మామ, అల్లుడు

మామ బాలయ్య, అల్లుడు నారా లోకేష్ ఇద్దరూ అక్కడ పెళ్లి ఏర్పాట్లు విషయమై డిస్కస్ చేసుకుంటూ కనిపించారు. అల్లుడు చెప్పిన సూచనలును ఆయన శ్రద్దగా వింటున్నట్లే కనిపిస్తున్నారు. నారా లోకేష్ ఈ పెళ్లికి ప్రత్యేక ఆకర్షణగా మారారు.

ఆత్మీయంగా ...

ఆత్మీయంగా ...

బాలకృష్ణ ..పెళ్లికి వచ్చిన అతిధులను ఆత్మీయంగా రిసీవ్ చేసుకుంటూ కనిపించారు. ఆయన తన ఇంట్లో వివాహానికి వచ్చిన వారందరితో కుశలం అడిగి ముచ్చటిస్తున్నారు.

అల్లుడుతో...

అల్లుడుతో...

అల్లుడు నారా లోకేష్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూంటే...బాలయ్య ..అతనితో మాట్లాడటానకి వెయిట్ చేస్తున్నారు. నారా లోకేష్ ఈ పెళ్లి లో ఆయన హడావిడిగా కనిపిస్తున్నారు.

పోలీసులు...

పోలీసులు...

పెళ్లికి హాజరైన పోలీసులను బాలకృష్ణ ఇలా రిసీవ్ చేసుకున్నారు. ఈ వివాహానికి పోలీస్ డిపార్టమెంట్ పూర్తి స్ధాయి భధ్రత ఏర్పాట్లు చేసింది.

సంప్రదాయం..

సంప్రదాయం..

తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా పెళ్లిని నిర్వహించేందుకు బాలకృష్ణ కుటుంబం ఏర్పాట్లు చేసింది. మొదటి నుంచి బాలకృష్ణ సంప్రదాయానికి పెద్ద పీట వేసే వ్యక్తి. తన తండ్రి బాటలోనే తెలుగుదనం ఉట్టిపడిలా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X