బాలయ్య ఇంట పెళ్లి : వెరైటీలతో విందు (ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం మతుకుమిల్లి శ్రీభరత్‌తో ఈ ఉదయం 8.52కు హైటెక్స్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరయ్యారు.

ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నందమూరి అభిమానుల రాకతో సందడి నెలకొంది. వివాహ వేడుకకు నారా చంద్రబాబు నాయుడు, రామోజీరావు, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, చిరంజీవి, జైపాల్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, 'ఈనాడు' ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివరావు, తేదేపా నేతలు యనమల రామకృష్ణుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అంబికాకృష్ణ, దేవినేని ఉమా, కరణం బలరాం, భాజపా నేత బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.

అలాగే సినీనటులు మోహన్‌బాబు, మంచు మనోజ్‌, లక్ష్మి, దాసరి నారాయణరావు, వెంకటేష్‌, గోపీచంద్‌, మురళీమోహన్‌, పరుచూరి బ్రదర్స్‌, జయసుధ, రాఘవేంద్రరావు, రామానాయుడు తదితరులు వచ్చి వధూ,వరులకు శుభాకాంక్షలు అందచేసారు. ఈ వివాహానికి వచ్చిన వారికి బాలకృష్ణ అద్బుతమైన రీతిలో ..వివధ రకాల స్పెషాలిటిలతో విందు ఏర్పాటు చేసారు.


ఆ విందు విశేషాలు స్లైడ్ షోలో...

ఆత్మీయ ఆహ్వానం..

ఆత్మీయ ఆహ్వానం..

ఓ ప్రక్క ఆధునికంగా ఉంటూ... తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా పెళ్లిని నిర్వహించేందుకు బాలకృష్ణ కుటుంబం ఏర్పాట్లు చేసింది. బాలకృష్ణ స్వయంగా అతిధులందరినీ ఆహ్వానిస్తూ బిజీగా ఉన్నారు. ఈ పెళ్లికి ఆయన అల్లుడు, నందమూరి కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విందు జరిగే ప్లేస్ లో...ఇలా

నందమూరి కళ్యాణ్ రామ్...

నందమూరి కళ్యాణ్ రామ్...

ఈ వివాహానికి నందమూరి కళ్యాణ్ రామ్ తనదైన శైలిలో డ్రెస్ చేసుకుని సకుటుంబ సపరివారంగా హాజరయ్యారు. తన బాబాయ్ కు ఆయన చేదోడు,వాదోడుగా గత కొద్ది రోజులుగా పెళ్లి పనుల్లో ఉంటూ వస్తున్నారు. ఆయన ఇలా విందు జరిగే చోట...

వెయిటింగ్..

వెయిటింగ్..

అతిధులు వస్తే వడ్డిద్దామని కేటరింగ్ వారు వివిధరకాల ఐటమ్స్ రెడీ చేసుకుని వెయిట్ చేస్తున్నారు. నోరూరించే ఐటమ్స్ తో ఈ అతిథి సత్కారం ఏర్పాటైంది.

టిఫెన్స్...

టిఫెన్స్...


ఉదయం పూట కావటంతో వచ్చిన అతిధులకు వివిధ రకాలైన అల్పాహారాలు అందచేసారు. ఫైవ్ స్టార్ హోటల్ రేంజిలో ఈ ఐటమ్స్ ఉన్నాయి.

పళ్ళు...

పళ్ళు...

ఈ విందులో...ప్రూట్స్ కు తగిన ప్రాధాన్యత ఉంది. వచ్చిన అతిధులు తమకు తోచినట్లు విందు ఆరగించేలా ఈ ఏర్పాట్లు ఘనంగా చేసారు.

పళ్ల షాపులాగ...

పళ్ల షాపులాగ...

చూసేందుకు పళ్ల షాపులాగ ఉన్నా..ఇదంతా వివాహానికి విచ్చేసిన ఆత్మీయులకు ఏర్పాటు చేసినదే. చూడగానే నోరూరించే పళ్లుని ప్రత్యేకంగా పలుచోట్ల నుంచి తెప్పించి ఏర్పాటు చేసారు.

స్వీట్స్....

స్వీట్స్....

ఈ పెళ్లి కోసం గత కొద్ది రోజులాగా ఏర్పాటు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ వంట కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వటవాళ్లు విచ్చేసి, తమ పాక నైపుణ్యం ప్రదర్శించారు.

దోశ స్పెషల్...

దోశ స్పెషల్...

అల్పాహారంలో భాగంగా దోశ స్పెషల్ గా పెట్టారు. రకరకాల దోశలు ఇక్కడ స్టాల్స్ లో ఏర్పాటు చేసారు. పెళ్లి విందులో తమకు తోచిన వంటకాలు ఆస్వాదించటానికి ఏర్పాటు చేసారు.

ఆహారం...అందం...

ఆహారం...అందం...

వంటకాలు రెడీ చేయటమే కాదు..వాటిని ఎట్రాక్ట్ చేసేలా సర్దటంలో కూడా నైపుణ్యం ఉండాలి. ఈ వివాహ వేడుక విందులో వంటకాలు ప్రత్యేక తరహాలో సర్ది అందరినీ ఆకట్టుకున్నాయి.

వాటర్...

వాటర్...

ఇంత పెద్ద పెళ్లి..ఎక్కడెక్కడ పెద్దలు హాజరవుతారు అనుకున్నప్పుడు మంచి నీళ్ల విషయంలోనూ శ్రద్ద తీసుకుంటారు. అందులో భాగంగా అందరికీ మినిరల్ వాటర్ అందచేసారు. ఇదిగో ఆ స్టాక్...

ఇడ్లీ...

ఇడ్లీ...

తెలుగు,తమిళ వాళ్లకు ఇష్టమైన ఇడ్లీ రకరకాల వెరైటీల్లో ఈ వివాహంలో ఎరేంజ్ చేసారు. దాంతో అతిధులు ఈ వెరైటీలు అడిగి మరీ వేయించుకుని ఆశ్వాదించటం జరిగింది.

మన వంటలే మొదట...

మన వంటలే మొదట...



విందులో కూడా తెలుగు సంప్రదాయం ప్రతిబింబించేలా నిర్వహించేందుకు బాలకృష్ణ కుటుంబం ఏర్పాట్లు చేసింది. మొదటి నుంచి బాలకృష్ణ సంప్రదాయానికి పెద్ద పీట వేసే వ్యక్తి. తన తండ్రి బాటలోనే తెలుగుదనం ఉట్టిపడిలా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X