»   » గౌతమీపుత్ర శాతకర్ణి: బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

గౌతమీపుత్ర శాతకర్ణి: బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లోనే ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం కావడంతో ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు.

తెలుగు జాతి గర్వించే గొప్ప చక్రవర్తికి సంబంధించిన స్టోరీ కావడంతో బాలయ్య ఎంతో ఇష్టంగా చేస్తున్న సినిమా ఇది. బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ కూడా ఇదే కావడం విశేషం. మరి ఇలాంటి సినిమా బాలయ్య రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు? అనేది కొంత కాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.


తాజాగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' మూవీకి సంబంధించి బాలయ్య తీసుకునే రెమ్యూనరేషన్ కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.


 రెమ్యూనరేషన్ ఎంత అంటే?

రెమ్యూనరేషన్ ఎంత అంటే?ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి బాలయ్య రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


 నిర్మాతలు 10 కోట్లు ఆఫర్ చేసినా వద్దన్నాడా?

నిర్మాతలు 10 కోట్లు ఆఫర్ చేసినా వద్దన్నాడా?


వాస్తవానికి నిర్మాతలు బాలయ్య రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసారట. అయితే సినిమాను మరింత గ్రాండ్ గా తీయాలి, ఎలాంటి లోటు లేకుండా సినిమా పర్‌ఫెక్టుగా తీయాలంటూ కావాలనే ఆయన తన రెమ్యూనరేషన్ రూ. 2 కోట్లు తగ్గించుకున్నట్లు టాక్. మరో వైపు సినిమా విషయంలో బాలయ్య డెడికేషన్, కమిట్మెంట్ చూసి నిర్మాతలు ఆశ్చర్యపోతున్నారు.రైట్స్ భారీ రేటుకు

రైట్స్ భారీ రేటుకు


మరో వైపు సినిమా రిలీజ్ ముందే గౌతమీ పుత్రశాతకర్ణి మూవీకి ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ఇప్పటికే రూ. 50 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. శాటిలైట్, ఆడియో, డిజిటల్, డబ్బింగ్ రైట్స్ రూపంలో మరో రూ. 20 కోట్లు..... మొత్తం రూ. 70 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. బాలయ్య కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్. సంక్రాంతి

సంక్రాంతి


సినిమాను సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న వ‌ర‌ల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. నటీనటులు

నటీనటులు


బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రియ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు.టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈ చిత్రానికి సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి, సంగీతం: చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.English summary
As per sources, Balayya has taken Rs 8 Cr remuneration for Gautamiputra Satakarni. Considering the craze for the film, makers have reportedly offered him to the tune of Rs 10 Cr but Balayya has reportedly taken what he felt deserving and returned the remaining amount asking them to use it to make the project in a grand manner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu