100లో నా వారసుడు లేడు: బాలయ్య స్పష్టీకరణ

By Bojja Kumar

హైదరాబాద్: ఇటీవల 'మనం' చిత్రం ద్వారా నాగార్జున తనయుడు అఖిల్ అతిథి పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ మధ్య మహేష్ బాబు '1' సినిమాలో అతని కొడుకు గౌతం అతిథి పాత్ర పోషించాడు. మరో వైపు ప్రస్తుతం తెరకెక్కుతున్న 'గోపాలా గోపాలా' చిత్రంలో వెంకటేష్ కొడుకు అర్జున్ కూడా అతిథి పాత్ర పోషించబోతున్నాడు.

ఈ నేపథ్యంలో బాలయ్య ప్రతిష్టాత్మకంగా చేయబోతున్న 100 సినిమా ద్వారా బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ తెరగ్రేటం చేయబోతున్నాడనే వార్తల జోరందుకున్నాయి. అతే బాలయ్య మాత్రం అలాంటిదేమీ లేదంటున్నాడు. బాలయ్య సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 2016లోనే మోక్షజ్ఞ హీరోగా తెరంగ్రేటం చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

Balakrishna Rubbishes all the Rumors

కొన్ని రోజుల క్రితం 100వ సినిమా గురించి బాలయ్య మాట్లాడుతూ...' పూర్వ జన్మ సుకృతం వలన నందమూరి తారకరామారావు బిడ్డగా పుట్టాను. ఆయన ఈన్నో అద్భుతమైన పాత్రలు చేసి అందనంత ఎత్తుకి ఎదిగారు. నేను ఆయన బాటలోనే పయనిస్తున్నాను. నటుడిగా, బాధ్యతగల రాజకీయ నాయకుడిగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అందుకే మంత్రి పదవిని సైతం వదులుకున్నాను. నా 98వ సినిమా అందరినీ మెప్పించేలా ఉంటే, నా 100వ సినిమా మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది' అని తెలిపారు.

ఈ సినిమా ఎవరితో చేస్తున్న విషయం బాలయ్య చెప్పక పోయినప్పటికీ.....రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఉంటుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. శ్రీకృష్ణ దేవరాయల సబ్జెక్టుతో ఈ చిత్రం ఉండే అవకాశం ఉంది. బాలయ్య కెరీర్లోనే హైలెట్ అయ్యేలా ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం సత్య దేవా దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా విషయానికొస్తే...ఈ చిత్రాన్ని రుద్రపాటి ప్రేమలతా సమర్పణలో రుద్రపాటి రామారావు ఎస్ఎల్ వి బేనర్లో నిర్మిస్తున్నారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్ముల్యేగా ఎన్నికయిన తర్వాత బాలయ్య నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X