బాలకృష్ణ ‘రూలర్’ ప్రారంభం,విడుదల తేదీలు

By Srikanya

హైదరాబాద్: కొంతకాలంగా షూటింగులకు దూరంగా కాలం గడుపుతూ వస్తున్న నందమూరి బాలకృష్ణ త్వరలోనే ముఖానికి రంగేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించబోతున్న సినిమా మే 15న సెట్స్ మీదకు వెళ్లనున్నది. ఆ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవుతుంది. ఈ సినిమాకి 'రూలర్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఇదివరకు 'నమో వెంకటేశ', 'దూకుడు' వంటి చిత్రాల్ని నిర్మించి ప్రస్తుతం మహేశ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ సినిమాని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ, శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'సింహా' ఏ స్థాయి విజయాన్ని చవిచూసిందో తెలిసిందే. 'రూలర్' కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో బాలయ్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా 'రూలర్' ఉండబోతోందని సమాచారం. బోయపాటి శ్రీను ఇప్పటికే ఓ పవర్ ఫుల్ కథను తయారు చేశారని చెప్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పార్టీ కార్యకర్తలకు, ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చేందుకు ఈ చిత్రం ఉపయోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి.

ప్రస్తుతం ఈ చిత్రం యూనిట్ ప్రిప్రొడక్షన్‌ పనులలో ఉంది. గతంలో వచ్చిన 'సింహా' చిత్రం భారీ విజయం సాధించింది. మరోసారి బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటించేందుకు రంగం సిద్ధమైంది. బాలకృష్ణ చివరగా నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రం ఆ మధ్యన మంచి అంచనాలతో విడుదలై ప్లాప్ అయ్యింది. మరో ప్రక్క బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'దమ్ము' చిత్రం డివైడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. 'శ్రీమన్నారాయణ' తర్వాత ఏ సినిమాకూ బాలయ్య పచ్చజెండా ఊపలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X