»   » 100వ సినిమా: బాలయ్యే స్టోరీ లైన్ ఇచ్చాడట, కీలకంగా శ్రీవాస్!

100వ సినిమా: బాలయ్యే స్టోరీ లైన్ ఇచ్చాడట, కీలకంగా శ్రీవాస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్యతో 99వ సినిమా ‘డిక్టేటర్' చిత్రానికి దర్శకుడిగా పని చేసి ఆయన అభిమానులు మెచ్చే సినిమా అందించారు శ్రీవాస్. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ‘డిక్టేటర్' చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు మాత్రమే కాదు.... సహ నిర్మాత కూడా. ఇటు దర్శకత్వం బాధ్యతను, అటు ప్రొడక్షన్ పనులను పర్ పెక్టుగా హ్యాండిల్ చేసాడు శ్రీవాస్.

‘డిక్టేటర్' సినిమా విషయంలో శ్రీవాస్ మంచి కమిట్మెంటుతో, డెడికేషన్ గా పని చేయడంతో..... త్వరలో బాలయ్యతో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ చేయబోయే 100వ సినిమా టీంలో ఆయన్ను నియమించాలని చూస్తోంది ఈరోస్ సంస్థ. బాలయ్య 100వ సినిమాకు ప్రొడక్షన్ సూపర్ వైజర్‌గా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Balakrishna's 100th film 'Aditya 999' details

బాలయ్య 100వ సినిమాకు ‘ఆదిత్య 999' పేరుతో తెరకెక్కనుంది. గతంలో వచ్చిన ‘ఆదిత్య 369' చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రానికి సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఇది సోషియో ఫాంటసీ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీగా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది ఈరోస్ సంస్థ.

ప్రొడక్షన్ మేనేజ్మెంటులో భాగం కాబోతున్న శ్రీవాస్ కు ప్రాఫిట్స్ లో కొంత షేర్ ఇవ్వాలని ఈరోస్ సంస్థ నిర్ణయించినట్లు సమాచారం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రం స్టోరీలైన్లో బాలయ్య కూడా కొన్ని మార్పులు చేసారట. అంటే ఇప్పటికే తయారైన స్టోరీకి తనవంతుగా కొన్ని మార్పులు, అభిప్రాయాలు చెప్పారని, బాలయ్య చెప్పిన విషయాలు బావుండటంతో ఆ అంశాలను కూడా సినిమాలో కలిపారని టాక్. ఇక బాలయ్య 100వ సినిమాలో ఆయన వారసుడు మోక్షజ్ఞ కూడా కనిపిస్తారని, త్వరలోనే సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు ప్రకటిస్తారని టాక్.

English summary
Film Nagar source siad that, Sri Vass will be supervising production works of Balakrishna's 100th film Aditya 999 Max to be directed by Singeetham Srinivasa Rao. Since the film is a socio fantasy, Eros is ready to invest big amount on the project and Sri Vass will get his share from profits for managing the production.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu