»   » బాలయ్య 100వ సినిమా గురించి క్రిష్ స్పందన...

బాలయ్య 100వ సినిమా గురించి క్రిష్ స్పందన...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య 100వ సినిమా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఉంటుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం దాదాపుగా ఖరారైనా.... ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. రెండో శతాబ్దంలో అమరావతిని పరిపాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి కథను వెండితెర మీద చూపించే ప్రయత్నం డైరెక్టర్ క్రిష్ చేయబోతున్నారు. దాని కోసం 'యోధుడు' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు అని తెలుస్తుంది.

క్రిష్ దర్శకత్వం వహించిన 'కంచె' చిత్రానికి జాతీయ అవార్డు దక్కడంతో బాలయ్య 100వ సినిమా దర్శకుడిగా అతడు సరైనోడే అనే వాదనకు బలం మరింత పెరిగింది. కంచె చిత్రానికి జాతీయ అవార్డు దక్కిన సందర్భంగా క్రిష్ మీడియాతో మాట్లాడుతూ తన తదుపరి చిత్రం గురించి స్పందించారు.

Balakrishna's 100th movie is going to be a historical

'కంచె' సినిమా చూశాక చాలామంది 'మంచి కథ, ఇటువంటి కొత్తదనమున్న కథలతో సినిమాలొస్తే పరిశ్రమ బావుంటుంది. భవిష్యత్తుకు ఇటువంటి సినిమాలు స్ఫూర్తిగా నిలుస్తాయి' అని నాతో చాలామంది అన్నారు. అది నిజమే. పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రేక్షకుల ఆలోచనలకు తగ్గట్టు సినిమాలొస్తున్నాయి. తెలుగుజాతి కీర్తిని చాటిచెప్పే నా తదుపరి చిత్రం త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో ఈ అవార్డు రావడం మరింత ఆనందంగా ఉంది'' అని తెలిపారు.

ఒకప్పుడు అమరావతిని పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు జాతి కీర్తి చాటిచెప్పే విధంగా సుపరిపాలన సాగించారు.....ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్య్వూలో క్రిష్ పరోక్షంగా బాలయ్య 100వ సినిమానే ప్రస్తావించాడని అంటున్నారు. మరో వైపు బాలయ్య కూడా మహారాజు గెటప్ కు తగిన విధంగా మీసాలు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో తెర వెనక ఈ సినిమాకు సంబంధించిన కసరత్తు జరుగుతుందని స్పష్టమవుతోంది.

Balakrishna's 100th movie is going to be a historical

బాలయ్య ముహుర్తాలు బాగా నమ్ముతారు కాబట్టి మంచి ముహూర్తం ఫిక్స్ చేసిన తర్వాత సినిమా ప్రారంభించాలని, మంచి సమయం చూసి సినిమా వివరాలను అఫీషియల్ గా ప్రకటించాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకే అటు బాలయ్యగానీ, ఇటు క్రిష్ గానీ ఈ విషయం గురించి నేరుగా స్పందించడం లేదు.

English summary
Balakrishna's 100th movie is going to be a historical movie based on the life of Gauthamiputra Satakarni, a Satavahana king.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu