»   » 101 వ సినిమా ప్రకటించిన బాలయ్య, పూర్తి వివరాలు..!

101 వ సినిమా ప్రకటించిన బాలయ్య, పూర్తి వివరాలు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందూపూర్: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తన 100వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గౌతమిపుత్ర శాతకర్ణి హిస్టరీ ఆధారంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

సోమవారం హిందూపూర్లో బాలయ్య తన 101వ సినిమా ప్రకటించారు. ఈ సినిమాను 'రైతు' అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

Balakrishna's 101th film details

బాలయ్య తాజా సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా విషయానికొస్తే...
బాలయ్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా బావించి చేస్తున్న ఈ వందో చిత్రం చారిత్రికం కావటంతో అందరి దృష్టీ దానిపైనే ఉంది. క్రిష్ ఈ విషయాన్ని అర్దం చేసుకుని అత్యంత జాగ్రత్తగా ప్రతీ విషయం అద్బుతంగా ఉండేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

ఇందులో బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఆయన సరసన శ్రియను చిత్ర బృందం ఇటీవలే ఎంపిక చేసింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల మొరాకోలో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశాల్లోని స్టిల్‌నే ఫస్ట్‌లుక్ పోస్టర్‌గా విడుదల చేశారు. ఇదిలా ఉంటే త్వరలో ఈ సినిమా మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంది.

English summary
NBK confirms his next film #NBK101 details in Hindupur today, titled #Raithu & Creative Director KrishnaVamsi directs the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu