బాలయ్య పేరు మారుతోంది: జయసింహ కాదు "NBK కర్ణ" ?

బాలయ్య 102 సినిమాకు ఇప్పటి దాకా వర్కింగ్ టైటిళ్లు రెండు వినిపిస్తూ వచ్చాయి. అవి ఒకటి జయసింహ. రెండవది లక్ష్మీనరసింహారెడ్డి. కానీ ఇప్పుడు మరో టైటిల్ తెరపైకి వచ్చింది.

Recommended Video

Here Is The Balakrishna's 102nd Movie Title బాలయ్య పేరు మార్చుకోబోతున్నాడా ?

బాలకృష్ణ-కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో సి కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం షూట్ చకచకా సాగిపోతోంది. ఎలాగైనా సరే సినిమాని మూడునెలల్లో పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి బాలయ్యని దింపాలన్నదే లక్ష్యం. పైసా వసూల్ సినిమా విషయంలో బాలయ్య అనుకున్నది ఒకటి అయినది ఒకటి. అయినా కూడా దాన్ని లైట్ తీసుకుని తన కొత్త సినిమా పనుల్లో బిజీ బిజీ అయిపోయాడు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడు అనే వార్త జోరుగా వినిపిస్తోంది. బాలకృష్ణకు దీటుగా నయనతార పాత్ర కొంత నెగటివ్ షేడ్స్ తో కూడుకున్నది అని కూడా చెబుతున్నారు.

హిట్ పడ్డట్టే

హిట్ పడ్డట్టే

సెంటిమెంట్ ప్రకారం "సింహ" ఉంటే బాలయ్యకి హిట్ పడ్డట్టే కాబట్టి ఈ సినిమాకు ఇప్పటి దాకా వర్కింగ్ టైటిళ్లు రెండు వినిపిస్తూ వచ్చాయి. రెండిటిలోనూ సింహ ఉండేలాగానే చూసుకున్నారు అవి ఒకటి జయసింహ. రెండవది లక్ష్మీనరసింహారెడ్డి. కానీ ఇప్పుడు మరో టైటిల్ తెరపైకి వచ్చింది.

కర్ణ

కర్ణ

అయితే ఇది కేవలం "వినిపించటం" కాదు దాదాపు ఈ టైటిల్ ఫిక్స్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఈ మూడో టైటిల్ కాస్త ఆసక్తికరంగానే వుంది కూడా. ఇంతకీ ఆ టైటిల్ మరేంటో కాదు. 'కర్ణ'. నిజానికి ఈ టైటిల్ చాలా పాపులర్ టైటిల్. శివాజీ గణేషన్, ఎన్టీఆర్ లు పౌరాణిక పాత్రల్లో నటించినపుడు వాడిన టైటిల్.

టైటిల్‌ దాదాపు ఖాయం

టైటిల్‌ దాదాపు ఖాయం

కొన్నాళ్ల క్రితం సీనియర్ అర్జున్ డబ్బింగ్ సినిమా ఒకటి ఇదే టైటిల్ లో వచ్చింది. కానీ ఆ విషయం పెద్దగా జనాలకు గుర్తు లేదు. ఇప్పుడు కర్ణ టైటిల్ ను బాలయ్య 102వ సినిమాకు ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్‌ దాదాపు ఖాయమన్నట్లుగా సోషల్ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఎన్‌బీకే

ఎన్‌బీకే "కర్ణ"

అయితే టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదని నిర్మాత సి. కల్యాణ్‌ తెలిపారు. ‘కర్ణ' అనే టైటిల్‌ పెట్టే అవకాశం లేదనీ, ‘ఎన్‌బీకే కర్ణ' అనే టైటిల్‌ పరిశీలనలో ఉందనీ ఆయన చెప్పారు. దీనితో పాటు ‘జయసింహ', ‘లక్ష్మీనరసింహారెడ్డి' అనే టైటిళ్లను కూడా పరిశీలిస్తున్నామన్నారు.

కంటైనర్‌ యార్డ్‌లో క్లైమాక్స్‌ షూట్

కంటైనర్‌ యార్డ్‌లో క్లైమాక్స్‌ షూట్

బాలయ్య సరసన మూడోసారి నాయికగా నయనతార నటిస్తోన్న ఈ చిత్రం ద్వారా నటాషా దోషి మరో నాయికగా తెలుగు తెరకు పరిచయమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక కంటైనర్‌ యార్డ్‌లో క్లైమాక్స్‌ సన్నివేశాల్ని భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ, నయనతార, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌ సహా చిత్రంలోని ప్రధాన తారాగణమంతా ఇందులో పాల్గొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X