బాలయ్య ‘అధినాయకుడు’ ఫస్ట్ లుక్ ట్రైలర్
నందమూరి బాలకృష్ణ అధినాయకుడు ఫస్టలుక్ ట్రైలర్ ను సంక్రాంతిని పురస్కరించుకుని ఈరోజు(జనవరి 14) విడుదల చేశారు. బాలయ్య ఇందులో మూడు డిఫరెంట్ గెటప్ లలో కనిపించనున్నారు. ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం స్టైలిష్ దర్శకుడు పరుచూరి మురళి రూపొందిస్తున్నారు. ఈ నెలలోనే ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో అధినాయకుడు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాతగా, తండ్రిగా, కొడుకుగా మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న బాలయ్య సరసన లక్ష్మీరాయ్, ఛార్మీ, సలోని హీరోయిన్ లుగా నటిస్తున్నారు. బాలకృష్ణ నటిస్తున్న ఓల్డ్ గెటప్ కు జోడీగా సహజనటి జయసుధ నటిస్తోంది. ఈ చిత్రంలో జయసుధ బాలకృష్ణకి బామ్మగా కనిపించనున్నారు. బాలకృష్ణ వేసిన ముసలాయన గెటప్ కి ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ లభించనుంది.
ఇటీవల విడుదలైన బాలయ్య 'శ్రీరామ రాజ్యం' మంచి విజయమే సాధించినప్పటికీ....బాలయ్య అభిమానులు కోరుకునే కమర్షియల్ అంశాలు లేక పోవడంతో పెద్దగా వసూళ్లు సాధించలేక పోయింది. ఈ నేపథ్యంలో అభిమానులకు పూర్తి విందులా రూపొందుతున్న 'అధికాయకుడు' సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











