బాలకృష్ణ రేంజ్ పెంచే ‘అధినాయకుడు’...!?
నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ తో ఎంఎల్ కుమార్ చౌదర్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సంస్థ నిర్మించిన ఆంధ్రుడు, పెదబాబు చిత్రాలకు దర్శకత్వం వహించిన పరుచూరి మురళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీరాయ్, సలోని కథానాయికలుగా నటిస్తున్నారు. నందమూరి అందగాడు త్రిపాత్రాభినయం చేయనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కర్నూల్‌లో వేలాది మంది జనం మధ్య జరుగుతోంది. గతంలో బాలకృష్ణ 'ఒక్కమగాడు" చిత్రంలో ద్విపాత్రాభినయం చేశాడు.
నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'ఈ చిత్రంలో బాలకృష్ణ మూడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. మూడు పాత్రలు వేటికవే అన్నట్లుగా అద్భుతంగా వుంటాయి. ఇటీవల కర్నూల్ లో బాలయ్యపై చిత్రీకరించిన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ పాట చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. యాక్షన్, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ ఇలా అన్ని అంశాలు ఈ చిత్రంలో సమపాళ్లలో వున్నాయి. తప్పకుండా ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్ లో మరో సంచలనాత్మకమైన చిత్రంగా నిలుస్తుంది. ఈ నెల 20 నుంచి యూరప్ లో రెండు పాటలు చిత్రీకరిస్తాం" అన్నారు.
బాలయ్య బాబు రేంజ్ కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తీస్తున్నాం. ఇప్పటివరకు మా సంస్థ నిర్మించిన చిత్రాల్లో ఎక్కువ శాతం హిట్ అయినవే ఉన్నాయి. ఆ చిత్రాలన్నీ మా సంస్థ ప్రతిష్టతను పెంచాయి. ఈ చిత్రం ఆ పేరుని రెట్టింపు చేసే విధంగా ఉంటుంది. మూడు వైవిద్యమైన పాత్రల్లో బాలయ్య అద్భుతంగా3 నటిస్తున్నారు. ఒక్కో పాత్రకు ఆయన కనబరుస్తున్నవ్యత్యాసంచూస్తుంటే చాలా ఆశ్చరంగా ఉంది అన్నారు. జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, చరణ్ రాజ్ తదితరులు ముఖ్యపావూతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కళ్యాణి మాలిక్, సమర్పణ: సందీప్.


Click it and Unblock the Notifications











