రామ్ చరణ్ కు పోటీగా ఆ రోజే బాలకృష్ణ
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చను మహా శివరాత్రికి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బాలకృష్ణ'అధినాయకుడు'పోటీ ఇవ్వనుంది. అదే రోజున బాలయ్య చిత్రం కూడా విడదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. ఈ విషయమై నిర్మాత ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరిమాట్లాడుతూ...సంక్రాంతి తరువాత ఆడియో విడుదల చేసి, మహాశివరాత్రికి ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. అలాగే శనివారం హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా టైటిల్‌ని అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణ, లక్ష్మీరాయ్ జంటగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రానికి 'అధినాయకుడు' అని టైటిల్ నిర్ణయించారు. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంగీతం కళ్యాణిమాలిక్.
నిర్మాత మాట్లాడుతూ "ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. కథను బట్టి ఈ సినిమాకి 'అధినాయకుడు' అని టైటిల్ నిర్ణయించాం. ఈ పేరును దర్శకుడు పరుచూరి మురళి సూచించారు. ఇప్పటికే మీడియాలో కూడా ఇదే పేరు ప్రచారం కావడంతో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ పేరునే సినిమాకి ఫైనల్ చేశాం. ఇందులో బాలకృష్ణ మూడు గెటప్స్‌లో కనిపిస్తారు. గత దసరా సందర్భంగా బాలకృష్ణ పెద్దాయన వేషంలో ఉన్న గెటప్‌ని రిలీజ్ చేశాం. ఇప్పుడు మరో గెటప్‌ని విడుదల చేస్తున్నాం. పెద్దాయన గెటప్‌లో బాలకృష్ణ అచ్చం ఎన్టీఆర్‌లా ఉన్నారు. పెద్దాయన క్యారెక్టర్‌పై చిత్రీకరించిన పాట హైలెట్‌గా ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు పాటలుంటాయి అన్నారు.


Click it and Unblock the Notifications











