For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Akhanda: స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన హాట్‌స్టార్.. బాలయ్య కష్టమంతా చూపిస్తూ!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీపై కరోనా వైరస్ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. 2020లో ఒకసారి, 2021లో మరోసారి లాక్‌డౌన్లు విధించడం వల్ల సినీ రంగానికి భారీ స్థాయిలో ఇబ్బందులు వచ్చాయి. మరీ ముఖ్యంగా సెకెండ్ వేవ్ తర్వాత పరిశ్రమ కోలుకోలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరూ ఊహించని రీతిలో థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుని.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ గ్రాండ్‌గా విడుదలైన చిత్రమే 'అఖండ'. నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించాడు. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

  హరితేజకు చేదు అనుభవం: ఎదవ ఓవర్ యాక్షన్.. నీకు కరోనా రావాలి అంటూ దారుణంగా!

  చాలా కాలంగా విజయం కోసం వేచి చూస్తోన్న నటసింహా నందమూరి బాలకృష్ణ.. సుదీర్ఘ విరామం తర్వాత బోయపాటి శ్రీనుతో కలిసి చేసిన సినిమా 'అఖండ'. క్రేజీ కాంబినేషన్‌లో భారీ స్థాయిలో వచ్చిన ఈ సినిమాకు ఆరంభం నుంచే ప్రేక్షకులు అదిరిపోయే స్పందనను అందించారు. మరీ ముఖ్యంగా ఇందులో బాలయ్య అఖండ పాత్రకు భారీ మార్కులే పడ్డాయి. అంతేకాదు, థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమా దూసుకుపోయింది. ఇలా యాభై రోజులను కూడా పూర్తి చేసుకుంది. ఏకంగా 105 కేంద్రాల్లో అర్ధ శతదినోత్సవాన్ని జరుపుకుని అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది.

  Balakrishnas Akhanda Exclusive Making Video Released

  'సింహా', 'లెజెండ్' వంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ'.. ఎన్నో అంచనాలతో వచ్చి థియేటర్లలో సందడి చేసింది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. ఇక, జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డులు నమోదు చేసింది. 24 గంటల్లోనే మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఏకైక సినిమాగా ఇది నిలిచింది. దీనిపై నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

  హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ

  ఇక, ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సందడి చేస్తోన్న 'అఖండ' మూవీ నుంచి తాజాగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ అయింది. డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్న ఇదే సంస్థ ఈ సినిమా ఎక్స్‌క్లూజివ్ మేకింగ్ వీడియోను వదిలింది. ఇందులో అఘోరా పాత్ర కోసం నందమూరి బాలకృష్ణ పడిన శ్రమను ప్రత్యేకంగా చూపించారు. అంతేకాదు, ఆయనకు ఇన్‌పుట్స్ ఇస్తున్న బోయపాటి శ్రీనును కూడా చాలా సేపే హైలైట్ చేశారు. ఇక, అన్నింటి మాదిరిగానే ఈ వీడియోకు కూడా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇది విడుదలైన కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

  నటసింహా బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన మూవీనే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేశాడు. ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం ఇచ్చాడు. ఇందులో పూర్ణ, జగపతి బాబు, రవి శంకర్ సహా ఎంతో మంది కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే.

  English summary
  Nandamuri Balakrishna Did Akhanda Movie Under Boyapati Srinu Direction. Now Exclusive Making Video Released From This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion