బాలీవుడ్‌లోకి బాలయ్య.. RRR భాగస్వామితో కలిసి.. బాక్సులు బద్దలవడం ఖాయం!
'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత చాలా కాలం పాటు పరాజయాల పరంపరతో సతమతం అయినా.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వచ్చారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలోనే 2021లో ఆయన 'అఖండ' అనే డివోషనల్ కాన్సెప్టు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఫలితంగా బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందించింది. తెలుగు ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు హిందీలోనూ విడుదల కాబోతుంది. ఆ పూర్తి వివరాలు మీరే చూసేయండి!

‘అఖండ'గా బాలయ్య అరాచకం
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటసింహా బాలకృష్ణ హీరోగా చేసిన చిత్రమే 'అఖండ'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీకాంత్ నెగెటివ్ రోల్‌ను చేశాడు. థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఇది అఖండమైన హిట్‌ను సొంతం చేసుకుంది.
ఆరియానా ఎద అందాల దర్శనం: ఇంత హాట్ వీడియో ఎప్పుడైనా చూశారా!
https://telugu.filmibeat.com/television/ariyana-glory-fabulous-selfie-video-viral-in-internet-116117.html

100 రోజులు... అరుదైన రికార్డులు
డివోషనల్ కాన్సెప్టుతో రూపొందిన 'అఖండ' మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ మూవీ లాంగ్ రన్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే ఇది వంద రోజులు పూర్తి చేసుకుంది. నేరుగా నాలుగు సెంటర్లలతో పాటు మొత్తంగా 20 కేంద్రాల్లో ఈ సినిమా ఈ మైలురాయిని చేరుకుని రికార్డులు సాధించింది.

భారీ కలెక్షన్లతో బాలకృష్ణ రేంజ్
సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రూపొందిన 'అఖండ'కు అంచనాలకు తగ్గట్లే ప్రపంచ వ్యాప్తంగా రూ. 53 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 94.27 కోట్లు షేర్‌ను వసూలు చేసింది. ఫలితంగా రూ. 40.27 కోట్లు లాభాలను దక్కించుకుని సత్తాను చాటుకుంది.

ఓటీటీలో రిలీజ్.. అక్కడా సక్సెస్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'అఖండ'. ఎన్నో అంచనాలతో వచ్చి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. ఈ మూవీ ఓటీటీలోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని ఎన్నో రికార్డులు నమోదు చేసుకుని ట్రెండింగ్‌లో నిలిచింది.

హిందీలో అఖండ మూవీ రిలీజ్
బాలయ్య కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అఖండ' మూవీ చాలా రోజుల పాటు థియేటర్లలో సందడి చేసింది. ఆ తర్వాత ఓటీటీలోనూ ఈ సినిమా హవాను చూపించింది. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య నటించిన ఈ సినిమాను ఇప్పుడు ఉత్తరాది వాళ్లకు అందించేందుకు హిందీలోనే రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా దీనిపై ప్రకటన వచ్చింది.

RRR భాగస్వామితో గ్రాండ్‌గానే
పవర్‌ఫుల్ సబ్జెక్టుతో రూపొందిన 'అఖండ' మూవీ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటింగ్ సంస్థ పెన్ స్టూడియోస్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ మేరకు జనవరి 20వ తేదీన ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తోంది. అంతేకాదు, అక్కడ స్టార్లతో సమానంగా ఎక్కువ స్క్రీన్లలో దీన్ని రిలీజ్ చేస్తుంది. గతంలో ఈ సంస్థ RRRకు భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
బాక్సులు బద్దలవడం ఖాయం
దక్షిణాదిలో కంటే ఉత్తరాదిలో డివోషనల్ కాన్సెప్టుతో వచ్చే చిత్రాలకు కాస్త ఎక్కువగానే ఆదరణ దక్కుతోంది. ఈ విషయం 'కార్తికేయ 2'తో రుజువు అయింది. దీనిబట్టి చూస్తే ఇప్పుడు బాలయ్య 'అఖండ' మూవీ కూడా నార్త్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకునే ఛాన్స్ ఉంది. అలాగే, థమన్ బ్యాగ్రౌండ్‌కు అక్కడి బాక్సులు కూడా బద్దలయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











